Deepika Padukone : ఇదేంద‌మ్మా.. దీపికా ప‌దుకునెపై నెటిజ‌న్ల ట్రోలింగ్‌..!

May 14, 2022 6:54 PM

Deepika Padukone : హీరోయిన్లు అన్నాక ఎల్ల‌ప్పుడూ ఫిట్‌గా ఉండాల్సిందే. అందుకు గాను వ్యాయామాలు లేదా యోగా.. లేదా ఇత‌ర వ‌ర్క‌వుట్స్ త‌ప్ప‌నిసరి. అయితే ఈ మ‌ధ్య కాలంలో హీరోయిన్లు తాము చిన్నపాటి వ‌ర్క‌వుట్ చేసినా.. దానికి సంబంధించిన ఫొటోల‌ను లేదా వీడియోల‌ను త‌మ సోష‌ల్ ఖాతాల్లో పోస్ట్ చేస్తున్నారు. దీంతో స‌హ‌జంగానే అవి వైర‌ల్ అవుతున్నాయి. అయితే అంత వ‌ర‌కు బాగానే ఉన్న‌ప్ప‌టికీ కొన్ని సార్లు వ‌ర్క‌వుట్స్ సంద‌ర్భంగా ధ‌రించే దుస్తులే వివాదాస్ప‌దం అవుతుంటాయి. స‌రిగ్గా బాలీవుడ్ న‌టి దీపికా ప‌దుకునెకు కూడా ఇలాంటి అనుభ‌వ‌మే ఎదుర‌వుతోంది. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే..

బాలీవుడ్ న‌టి దీపికా ప‌దుకునె ప‌లు ర‌కాల యోగా ఆస‌నాల‌ను చేసింది. అయితే యోగా చేస్తే త‌ప్పేమిటని అడ‌గ‌వ‌చ్చు.. కానీ ఆమె యోగా చేస్తున్న‌ప్పుడు ధ‌రించిన డ్రెస్సే ఆమెను విమ‌ర్శ‌ల పాలు చేస్తోంది. ఆమె స్కిన్ క‌ల‌ర్ క‌లిగిన దుస్తుల‌ను ధ‌రించి యోగా చేసింది. దీంతో మొద‌ట ఒక్క‌సారిగా స‌డెన్‌గా చూస్తే ఆమె దుస్తులు వేసుకోలేదు కాబోలు.. అని భావ‌న క‌లుగుతుంది. కానీ త‌రువాత చూస్తే ఆమె డ్రెస్ వేసుకుంద‌ని స్ప‌ష్టంగా తెలుస్తుంది. అయితే ఆమె అలాంటి డ్రెస్ ధ‌రించి యోగా చేసినందుకు గాను నెటిజన్లు ఆమెను విమ‌ర్శిస్తున్నారు.

netizen troll Deepika Padukone on her yoga session photos
Deepika Padukone

దీపికా ప‌దుకునే యోగా చేసిన‌ప్పుడు వేసుకున్న డ్రెస్ ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆమెను అంద‌రూ విమ‌ర్శిస్తూ ట్రోల్ చేస్తున్నారు. యోగాకు ఇంత‌క‌న్నా మంచి డ్రెస్ ఏదీ లేదా.. ఇలాంటి డ్రెస్ ఎందుకు ధ‌రించావు.. అంటూ ఆమెను ప్ర‌శ్నిస్తున్నారు.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే దీపికా ప‌దుకునె ఇటీవ‌లే గెహ్రాయియా అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ మూవీలో ఆమె బోల్డ్ సీన్ల‌లో రెచ్చిపోయింది. దానిపై కూడా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇక ఈమె ప్ర‌స్తుతం స‌ర్క‌స్‌, ప‌ఠాన్‌, ప్రభాస్ ప్రాజెక్ట్ కె, ఫైట‌ర్ అనే సినిమాల‌తో బిజీగా ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now