Jabardasth : జ‌బ‌ర్ద‌స్త్ షోల‌కు ప‌ర్మినెంట్ జ‌డ్జిగా శ్ర‌ద్ధా దాస్‌..? గ్లామ‌ర్ విందుకు రెడీయా..?

May 11, 2022 7:23 AM

Jabardasth : బుల్లితెర‌పై అత్య‌ధిక టీఆర్‌పీ రేటింగ్‌ల‌తో దూసుకుపోతున్న షోల‌లో జ‌బ‌ర్ద‌స్త్ ఒక‌టి. కానీ నాగ‌బాబు వెళ్లిపోయాక ఈ షోకు కాస్త క‌ళ త‌ప్పింది. అయినా స‌రే ఈ షోను ప్రేక్ష‌కులు అల‌రించారు. అయితే ఇటీవ‌లి కాలంలో ప‌లువురు క‌మెడియన్ల‌తోపాటు రోజా కూడా జ‌బ‌ర్ద‌స్త్ షోకు గుడ్ బై చెప్పారు. ఆమె మంత్రి అయ్యారు క‌నుక బిజీ షెడ్యూల్ ఉంటుంది. దీంతో టైమ్ కేటాయించ‌లేరు. క‌నుక‌నే ఆమె జ‌బ‌ర్ద‌స్త్‌కు వీడ్కోలు ప‌లికారు. అయితే అంతా బాగానే ఉంది.. కానీ ఈ షోకు ప‌ర్మినెంట్ మ‌హిళా జ‌డ్జిగా ఎవ‌రిని పెట్టాలా.. అని నిర్వాహ‌కులు ఆలోచిస్తున్నార‌ట‌.

Jabardasth shows may get Shraddha Das as permanent judge
Jabardasth

గ‌తంలో ఇంద్ర‌జ‌, ఆమ‌ని, సంఘ‌వి, ఢీ పూర్ణ వంటి వారు మ‌హిళా జ‌డ్జిలుగా ఉన్నారు. అయితే వీరిలో కొంద‌రికి షోలు చేయ‌డం ఇష్టం లేదు. ఇక ఇంద్ర‌జ ఇతర షోల‌తో ఇప్ప‌టికే బిజీగా ఉన్నారు. క‌నుక జ‌బ‌ర్ద‌స్త్‌కు పూర్తి స్థాయిలో జ‌డ్జిగా ఉండ‌డం కుద‌ర‌డం లేదు. క‌నుక‌నే ప‌ర్మినెంట్ మ‌హిళా జ‌డ్జి అయితే బాగుంటుంద‌ని టీమ్ ఆలోచిస్తున్న‌ద‌ట‌. ఇప్ప‌టికే జ‌బ‌ర్ద‌స్త్‌, ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్ అని రెండు షోలు ఉన్నాయి. కానీ రెండు షోల‌కు జ‌డ్జిల‌ను అడ్జ‌స్ట్ చేయ‌డం వీలు కావ‌డం లేద‌ట‌. క‌నుక ఒక మ‌హిళా జడ్జిని ప‌ర్మినెంట్‌గా తీసుకుంటే బాగుంటుంద‌ని టీమ్ అనుకుంటుంద‌ట‌. అందుక‌నే కొత్త న‌టి కోసం వేట ప్రారంభించిన‌ట్లు సమాచారం.

అయితే జ‌బ‌ర్ద‌స్త్ రెండు షోల‌కు కూడా ప‌ర్మినెంట్ మ‌హిళా జ‌డ్జిగా న‌టి శ్ర‌ద్ధా దాస్‌ను ఎంపిక చేశార‌ని టాక్ వినిపిస్తోంది. ఆమె జ‌డ్జిగా దాదాపు ఖ‌రారు అయింద‌ని స‌మాచారం. అదే నిజ‌మైతే ఆమె గ్లామ‌ర్ తో షో రేటింగ్స్ ఎక్క‌డికో వెళ్తాయ‌ని చాలా సుల‌భంగా చెప్ప‌వ‌చ్చు. శ్ర‌ద్ధా దాస్‌కు ప్ర‌స్తుతం సినిమాల్లో ఆఫర్లు ఏమీ లేవు. క‌నుక ఆమె పూర్తి స్థాయిలో ఈ షోల‌కు ప‌ర్మినెంట్ జ‌డ్జిగా చేసే అవ‌కాశాలు ఉన్నాయి. క‌నుక‌నే ఆమెను నిర్వాహ‌కులు సంప్ర‌దించార‌ని.. అందుకు ఆమె ఓకే చెప్పింద‌ని కూడా తెలుస్తోంది. ఇక దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌నను వెల్ల‌డించ‌డం ఒక్క‌టే మిగిలి ఉంద‌ని అంటున్నారు. దీంతో శ్ర‌ద్ధా దాస్ జ‌బ‌ర్ద‌స్త్ షోల‌కు జ‌డ్జిగా వ‌స్తుంద‌ని అంటున్నారు.

శ్ర‌ద్ధా దాస్‌కు ఇప్ప‌టికే సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ‌. ఈ అమ్మ‌డు చేసే గ్లామ‌ర్ ట్రీట్‌కు మ‌తులు పోతుంటాయి. అందాల ఆర‌బోత‌నే ల‌క్ష్యంగా ఈమె ఫొటోలు షేర్ చేస్తుంటుంది. జ‌బ‌ర్ద‌స్త్‌కు ఈమె గ్లామ‌ర్ తోడైతే.. షో మ‌రింత పాపుల‌ర్ అవుతుంద‌ని అంటున్నారు. అయితే ఇప్ప‌టికే క‌ష్ట‌కాలంలో ఉన్న ఈ షోల‌కు ఇది ఎంతో క‌ల‌సి వ‌స్తుంద‌ని అంటున్నారు. చూడాలి మ‌రి.. ఏం జ‌రుగుతుందో..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now