Venu Swamy : స‌మంతలాగే న‌య‌న‌తార‌కు కూడా పెళ్లి క‌ల‌సిరాదు.. వేణు స్వామి సంచ‌లన‌ వ్యాఖ్య‌లు..

May 10, 2022 8:11 AM

Venu Swamy : అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంత త‌మ వివాహ బంధానికి స్వ‌స్తి ప‌లుకుతున్న‌ట్లు గతేడాది అక్టోబ‌ర్ లో వెల్ల‌డించారు. దీంతో అంద‌రూ ఒక్క‌సారిగా షాక‌య్యారు. టాలీవుడ్ క్యూట్ క‌పుల్‌గా ఉన్న‌వీరు అస‌లు ఎందుకు విడాకులు తీసుకుంటున్నారో తెలియ‌క చాలా మంది అనేక సందేహాల‌ను వ్య‌క్తం చేశారు. అయితే అది గ‌తం. ఇప్పుడు ఎవ‌రి సినిమాల‌తో వారు బిజీగా మారిపోయారు. కానీ వీరి వివాహం నిల‌బ‌డ‌ద‌ని.. పెళ్లి అయినా స‌రే క‌ల‌హాల కార‌ణంగా విడిపోతార‌ని.. ప్ర‌ముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి అప్ప‌ట్లో చెప్పారు. ఆయ‌న చెప్పిన‌ట్లే వారు విడిపోయారు. దీంతో ఆయ‌న జ్యోతిష్యంపై గురి కుదిరింది.

Venu Swamy said marriage will not work for Nayanthara
Venu Swamy

గ‌తంలో వేణు స్వామి జ‌గ‌న్ సీఎం అవుతార‌ని చెప్పారు. అలాగే జ‌రిగింది కూడా. ఈ క్ర‌మంలోనే వేణు స్వామి జ్యోతిష్యం అంటే చాలా మందికి న‌మ్మ‌కం ఏర్ప‌డింది. అయితే ఈయ‌న తాజాగా న‌య‌న‌తార జాత‌కం చూశారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న షాకింగ్ విష‌యాల‌ను వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ఆమె జాత‌కంలో గురుడు నీచ స్థితిలో ఉన్నాడ‌ని.. క‌నుక ఆమె ఇప్పుడు వివాహం చేసుకోవ‌ద్ద‌ని చెప్పారు. చేసుకున్నా వారు విడిపోతార‌ని అన్నారు. అయితే న‌య‌న‌తార త‌న ప్రియుడు విగ్నేష్ శివ‌న్‌తో క‌లిసి ఇప్ప‌టికే ప‌లు ఆల‌యాల‌ను సంద‌ర్శించి అనేక సార్లు పూజ‌లు చేశారు. చూస్తుంటే వారికి కూడా ఈ విష‌యం ముందుగానే తెలుస‌ని.. క‌నుక‌నే వైవాహిక జీవితంలో ఎలాంటి స‌మ‌స్య‌లు రాకుండా దాంప‌త్యం అన్యోన్యంగా ఉండేందుకు వారు ముందుగానే శాంతి పూజ‌లు చేశార‌ని తెలుస్తోంది.

అయితే వారు పూజ‌లు చేశారు క‌నుక వేణు స్వామి చెప్పిన‌ట్లు జ‌ర‌గ‌క‌పోవ‌చ్చ‌ని అంటున్నారు. గ్ర‌హ దోషాలు, జాత‌కంలో దోషాలు ఉన్న‌ప్పుడు పూజ‌లు చేయ‌డం స‌ర్వ‌సాధార‌ణం. క‌నుక ఈసారి మాత్రం ఆయ‌న జ్యోతిష్యం ఫ‌లించ‌ద‌ని.. న‌య‌న‌తార‌, విగ్నేష్ శివ‌న్ క్యూట్ క‌పుల్‌గా జీవ‌నం సాగిస్తార‌ని అంటున్నారు. ఇక ఈ విష‌యం తెలియాలంటే.. కొంత కాలం వ‌ర‌కు ఆగాల్సిందే. అయితే వేణు స్వామి గ‌తంలో ఒక‌సారి అనుష్క శెట్టి, ప్ర‌భాస్ వంటి స్టార్స్ జాత‌కాల‌పై కూడా కామెంట్లు చేశారు. అనుష్క శెట్టి వివాహం ఇప్ప‌ట్లో కాద‌ని.. ప్ర‌భాస్‌కు అయితే ఇంకో ఏడాదిన్న‌ర‌లో వివాహం అవుతుంద‌ని అన్నారు. మ‌రి ఆయ‌న చెప్పింది జ‌రుగుతుందో లేదో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now