Ira Khan : అమీర్‌ఖాన్‌ కుమార్తెపై నెటిజన్ల ఫైర్‌.. సిగ్గు లేదా.. మంచి దుస్తులు ధరించవచ్చు కదా.. అని కామెంట్స్‌..!

May 9, 2022 7:41 PM

Ira Khan : బాలీవుడ్‌ ప్రముఖ నటుడు అమీర్‌ఖాన్‌ కానీ.. ఆయన కుమార్తె ఇరా ఖాన్‌ కానీ ఎల్లప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. అమీర్‌ఖాన్‌ సామాజిక అంశాలపై కూడా స్పందిస్తుంటారు. అయితే ఆయన కొన్నిసార్లు చేసే వ్యాఖ్యలు.. చేసే పనులు వివాదాస్పదం అవుతుంటాయి. అలాగే ఆయన కుమార్తెను కూడా నెటిజన్లు ఎక్కువగా ట్రోల్‌ చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఇరా ఖాన్‌ మరోమారు విమర్శల పాలవుతోంది. తన బర్త్‌ డే సందర్భంగా ఆమె బికినీ ధరించి తండ్రి అమీర్‌ఖాన్‌ పక్కనే ఉండి కేక్‌ కట్‌ చేసింది. అయితే అంతా బాగానే ఉంది. కానీ ఆమె అలా బికినీ ధరించడంపైనే నెటిజన్లు ఫైరవుతున్నారు.

Ira Khan being trolled by netizen for her dress
Ira Khan

ఆదివారం ఇరాఖాన్‌ తన 25వ పుట్టిన రోజును సెలబ్రేట్‌ చేసుకుంది. చూస్తుంటే ఏదో రిసార్ట్‌లోనో.. హోటల్‌లోనూ అమీర్‌ఖాన్‌ కుటుంబం మొత్తం ఉన్నట్లు ఫొటోలను చూస్తే అర్థమవుతుంది. అక్కడే ఇరాఖాన్‌ వెంటే బాయ్‌ ఫ్రెండ్‌ నుపుర్‌ శిఖరే, సోదరుడు ఆజాద్‌ రావ్‌ ఖాన్‌లు కూడా ఉన్నారు. అయితే ఆమె బర్త్‌ డే వేడుక సందర్భంగా కేక్‌ కూడా కట్‌ చేసింది. అందరూ స్విమ్మింగ్‌ పూల్‌లో సరదాగా గడుపుతూ ఈ వేడుకలో పాల్గొనట్లు అర్థమవుతోంది. అయితే ఇరాఖాన్‌ మాత్రం బికినీలో అందాలను ప్రదర్శిస్తూ కనిపించింది. దీంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీకు సిగ్గులేదా.. కనీసం మంచి బట్టలు అయినా వేసుకోవచ్చు కదా.. అంటూ విమర్శిస్తున్నారు.

అయితే ఇరాఖాన్‌ ఇటీవల రంజాన్‌ సందర్భంగా కూడా ఓ డ్రెస్‌ ధరించగా.. అది కూడా గ్లామర్‌గానే ఉంది. దీంతో ఆమెను అప్పుడు ట్రోల్‌ చేశారు. అది జరిగి కనీసం వారం కూడా కాకముందే మళ్లీ ఆమె ఇలా కనిపించడంతో మరోమారు నెటిజన్లు తమదైన శైలిలో ఆమెపై విరుచుకుపడుతున్నారు. ఇక ఇరాఖాన్‌ తనకు మానసిక వ్యాధి ఉందని.. సడెన్‌గా ఆందోళనకు గురవుతానని.. గతంలో ఎన్నోసార్లు చెప్పింది. కాగా అమీర్‌ఖాన్‌ ఇటీవలే తన భార్య కిరణ్‌ రావ్‌కు విడాకులు ఇచ్చిన విషయం విదితమే. ఆయన ఇంకో హీరోయిన్‌తో రిలేషన్‌షిప్ లో ఉన్నారని.. అందుకనే విడాకులు ఇచ్చి ఉంటారని బీటౌన్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక అమీర్‌ఖాన్‌ త్వరలో లాల్‌ సింగ్‌ చడ్డా మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment