Viral Photo : సోషల్ మీడియాలో ప్రస్తుతం అనేక ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిని నెటిజన్లు ఎంతో ఆసక్తిగా వీక్షిస్తుంటారు. అయితే కొన్ని రకాల ఫొటోలు మాత్రం మనల్ని భ్రాంతికి గురి చేస్తుంటాయి. ఆ ఫొటోల్లో ఏదో ఒక వస్తువో, జంతువో, పక్షో.. దాగి ఉంటుంది. దాన్ని కనిపెట్టడం సవాల్‌గా మారుతుంది. అలాంటి ఫొటోలు మనకు చాలానే అందుబాటులో ఉన్నాయి. అప్పుడప్పుడు అలాంటి ఫొటోలు వైరల్ అవుతుంటాయి. దీంతో వాటిల్లో దాగి ఉన్నవాటిని కనిపెట్టేందుకు అందరూ నానా అవస్థలు పడుతుంటారు. ఇక అలాంటిదే ఒక ఫొటో లేటెస్ట్‌గా వైరల్‌గా మారింది. అందులో ఒక పక్షి దాగి ఉండడం విశేషం.

పైన ఇచ్చిన ఫొటోను లారెన్స్ డిబెలియల్ అనే మహిళ 2016లో తీసింది. బెల్జియంకు చెందిన ఆమెఅక్కడి నార్త్ ఇన్వర్‌నెస్ అనే ప్రాంతంలో ఉన్న బెన్ వైవిస్ అనే చోట కొండ ఎక్కుతూఈ ఫొటోను తీసింది. అయితే అది చాలా సాధారణ ఫొటో అని అందరూ అనుకున్నారు. కానీ అందులో ఒక పక్షి దాగి ఉన్నట్లు ఈ మధ్యే తెలిసింది. దీంతో దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది వైరల్‌గా మారింది. ఈ క్రమంలోనే అందులో దాగి ఉన్న పక్షిని కనిపెట్టేందుకు నెటిజన్లు శ్రమిస్తున్నారు.
ఇక ఈ ఫొటోను చాలా జాగ్రత్తగా గమనిస్తే ఫొటో కింది భాగంలో ఎడమ వైపు ఓ పక్షి ఉంటుంది. కానీ అది అక్కడ ఉన్న రాళ్ల రంగులో కలసిపోయింది. కనుకనే ఆ పక్షిని కనిపెట్టడం కష్టంగా మారింది. ఇక ఈ ఫొటో సోషల్ మీడియాలో షేర్ అవుతుండగా.. దీంట్లో దాగి ఉన్న పక్షిని కనిపెట్టేందుకు నెటిజన్లు శ్రమిస్తున్నారు. ఇక పక్షి కనిపించిందిగా మరి..!