Ashoka Vanamlo Arjuna Kalyanam : అశోక‌వ‌నంలో అర్జున క‌ళ్యాణం రివ్యూ.. విశ్వ‌క్ సేన్ అద‌ర‌గొట్టేశాడుగా..!

May 6, 2022 11:49 AM

Ashoka Vanamlo Arjuna Kalyanam : మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న విష‌యం తెలిసిందే. మాస్ కా దాస్.. అశోక వనంలో అర్జున కళ్యాణం అనే చిత్రంతో క్లాస్ కా దాస్‌గా మారాడు. విశ్వక్ సేన్ ఈ క్లాసీ క్యారెక్టర్ ను ఏ విధంగా పోషించాడా.. అని చాలా మంది అభిమానులు, సినీ విశ్లేషకులు ఎదురుచూస్తున్నారు. విశ్వక్ సేన్, రుక్సార్ థిల్లాన్, రితికా నాయక్, గోపరాజు రమణ, రాజ్ కుమార్, ఇతరులు ఈ మూవీలో ముఖ్య పాత్ర‌లు పోషించారు.

Ashoka Vanamlo Arjuna Kalyanam movie review
Ashoka Vanamlo Arjuna Kalyanam

ఈ చిత్రానికి రచన రవికిరణ్ కోలా, దర్శకత్వం విద్యా సాగర్ చింత, సంగీతం జై క్రిష్, ఛాయాగ్రహణం పవి. కె. పవన్, ఈ చిత్రాన్ని ఎస్.వి.సి.సి డిజిటల్ సినిమా నిర్మాణంపై బాపినీడు బి, సుధీర్ ఈదర నిర్మించారు. బీవీఎస్ఎన్‌ ప్రసాద్ సమర్పించారు. ఈ చిత్రం సూర్యాపేటలో వడ్డీ వ్యాపారి అయిన అల్లం అర్జున్ కథను వివరిస్తుంది. అతను 34 ఏళ్లు వచ్చిన కూడా ఇంకా పెళ్లి చేసుకోని కారణంగా కుటుంబం, సమాజం నుండి ఇబ్బందులు ఎదుర్కొంటుంటాడు. వారి కులంలో అమ్మాయిలు అయిపోయారని, వేరే కులం వాళ్ళైనా సరే అని వ‌ధువు కోసం వెదుకుతుంటాడు. ఈ క్ర‌మంలోనే పసుపులేటి మాధవి (రుక్సార్ థిల్లాన్) వ‌ధువుగా దొరుకుతుంది. అయితే.. పసుపులేటి మాధవి.. అల్లం అర్జున్‌ని తిరస్కరిస్తుంది. ఆమె ఎందుకు తిర‌స్క‌రించింది ? ఆ స‌మ‌యంలో మ‌నోడు ప‌డే బాధ‌లు ఏంట‌నేది.. సినిమా చూస్తే అర్ధ‌మ‌వుతుంది.

ఈ సినిమా బాగానే మొదలవుతుంది. దర్శకుడు కథలోకి వెళ్ళడానికి ఎక్కువ సమయాన్ని వృథా చేయలేదు. అయితే సినిమా దాదాపు 15 నుండి 20 నిమిషాల వరకు బాగానే అనిపించినా ఆ తర్వాత సినిమా స్క్రీన్‌ప్లే కాస్త స్లో అవుతుంది. ప్రీ ఇంటర్వెల్ నుండి సినిమా ఆసక్తిని కలిగిస్తుంది. మొదట‌ కొన్ని కామెడీ సన్నివేశాలు బాగానే పండాయి అని చెప్పొచ్చు. కానీ చాలా పాత్రలు అసహజంగా అనిపిస్తాయి. సెకండాఫ్ సినిమాకి వెన్నెముక అననడంలో ఎలాంటి సందేహంలేదు.

అల్లం అర్జున్‌గా విశ్వ‌క్‌ తన పాత్రకి న్యాయం చేశాడు. చాలా సన్నివేశాల్లో తన నటనను చూపించాడు. ముఖ్యంగా కొన్ని కామెడీ సన్నివేశాలలో చాలా బాగా చేశాడు. రుక్సార్‌తోపాటు మిగ‌తా పాత్ర‌ధారులు కూడా బాగా చేశారు. సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. ఈ చిత్రానికి రచయిత రవికిరణ్ కోలా.. రాజా వారు రాణి వారు అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. దశాబ్దాలుగా మనం ఈ రకమైన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాలను మిస్ అవుతున్నసమయంలో ఇలాంటి కథతో రావడం చాలా మంచి విషయం. 30 సంవత్సరాలు దాటినా పెళ్లి కావట్లేదు.. అని బాధపడేవారు అయితే తప్పకుండా ఈ మూవీని ఒక‌సారి చూసి ఎంజాయ్ చేయ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now