Vishnu Manchu : విశ్వ‌క్ నా త‌మ్ముడు.. మంచు విష్ణు స‌పోర్ట్‌..!

May 6, 2022 8:28 AM

Vishnu Manchu : యాంక‌ర్ దేవి నాగ‌వ‌ల్లితో గొడ‌వ అయిన‌ప్ప‌టి నుంచి విశ్వ‌క్ సేన్‌ను స‌పోర్ట్ చేస్తున్న టాలీవుడ్ న‌టుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఈ క్ర‌మంలోనే కొంద‌రు ఆయ‌న‌కు నేరుగా స‌పోర్ట్‌ను అందిస్తే.. కొంద‌రు ఆయ‌న సినిమాను అభినందిస్తూ ఇన్‌డైరెక్ట్‌గా స‌పోర్ట్ ఇస్తున్నారు. న‌టి క‌రాటే క‌ల్యాణి, ద‌ర్శ‌కులు బండి స‌రోజ్‌, హ‌రీష్ శంక‌ర్‌, హేతువాది బాబు గోగినేని, క‌మెడియ‌న్ రాహుల్ రామ‌కృష్ణ‌లు నేరుగా మ‌ద్ద‌తు ఇచ్చారు.

Vishnu Manchu wished all the best Vishwak Sen for his latest movie
Vishnu Manchu

ఇక మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్, డీజే టిల్లు ఫేమ్ సిద్ధు జొన్న‌లగ‌డ్డ‌లు విశ్వ‌క్ సేన్ సినిమా.. అశోక‌వ‌నంలో అర్జున క‌ల్యాణం చూశామ‌ని.. చాలా బాగుంద‌ని.. విశ్వ‌క్ అద్భుతంగా న‌టించాడ‌ని.. కొనియాడుతూ ట్వీట్లు చేశారు. అయితే తాజాగా మా అధ్య‌క్షుడు, న‌టుడు మంచు విష్ణు కూడా ఇన్‌డైరెక్ట్ గా విశ్వ‌క్ కు స‌పోర్ట్ ఇచ్చారు.

విశ్వ‌క్ సేన్‌ను త‌మ్ముడిగా అభివ‌ర్ణించిన విష్ణు.. ఆయ‌న న‌టించిన అశోక‌వ‌నంలో అర్జున క‌ల్యాణం సినిమా హిట్ కావాల‌ని కోరుకుంటున్నాన‌ని తెలిపారు. ఈ మేర‌కు విష్ణు ట్వీట్ చేశారు. ఈ క్ర‌మంలోనే విశ్వ‌క్‌కు డైరెక్ట్‌గా, ఇన్‌డైరెక్ట్‌గా టాలీవుడ్ న‌టులు స‌పోర్ట్‌ను అందిస్తున్నారు. మ‌రోవైపు నెటిజ‌న్లు సైతం విశ్వ‌క్‌కే అండ‌గా నిలిచారు.

ఇక విశ్వ‌క్ న‌టించిన అశోక‌వ‌నంలో అర్జున క‌ల్యాణం సినిమా శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ట్విట్ట‌ర్ రివ్యూ ప్ర‌కారం.. సినిమా బాగుంద‌నే టాక్ వినిపిస్తోంది. ఇందులో విశ్వ‌క్‌కు జంట‌గా రుక్సార్ థిల్లాన్ న‌టించ‌గా.. విద్యాసాగ‌ర్ చింతా ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. బాపినీడు, సుధీర్ ఈద‌ర ఈ చిత్రాన్ని నిర్మించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now