Shriya Saran : బీచ్ ఒడ్డున బికినీలో మ‌తులు పోగొడుతున్న‌శ్రియ‌.. వీడియో..!

May 5, 2022 11:45 AM

Shriya Saran : ఒక‌ప్పుడు టాలీవుడ్ టాప్ హీరోలంద‌రితోనూ క‌లిసి న‌టించిన శ్రియ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ స‌త్తా చాటుతోంది. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే శ్రియ మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. అందులో తన ఫిగర్‌తో అందరి దృష్టినీ ఆకట్టుకున్న ఈ భామ.. ఆ తర్వాత చాలా బ్రాండ్లకు ప్రచారకర్తగానూ వ్యవహరించింది. ఈ క్రమంలోనే ఇష్టం అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. తర్వాత సంతోషంతో కెరీర్‌లో ఫస్ట్ హిట్‌ను సొంతం చేసుకుని పాపులర్ అయింది.

Shriya Saran at beach with hear daughter on vacation
Shriya Saran

అలా రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేస్తూ వచ్చిన శ్రియ కెరీర్‌లో ఎక్కువ మూవీలు చేసి హవాను చూపించింది. అలా సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటింది. దీంతో ఆఫర్లతోపాటు రెమ్యూనరేషన్‌నూ బాగా అందుకుంది. కొద్ది రోజుల క్రితం ఇంగ్లండ్‌కి చెందిన వ్య‌క్తిని పెళ్లి చేసుకొని రాధ అనే చిన్నారికి జ‌న్మ‌నిచ్చింది. ఇప్పుడు ఆ చిన్నారితో శ్రియ‌ చేస్తున్న సంద‌డి మామూలుగా లేదు. తన పాప రాధను ఒళ్లో కూర్చోబెట్టుకుని మరీ బీచ్‌లో హల్‌చల్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

పింక్ కలర్ టూ పీస్ బికినీ ధరించి బీచ్ లో జలకాలాడుతూ కెమెరాకు ఫోజులిచ్చిన శ్రియ‌ తడిసిన అందాలు చూపిస్తూ మ‌తులు పోగొడుతోంది. ఫ్యామిలీ లైఫ్ పూర్తి స్థాయిలో ఆస్వాదిస్తున్న ఆమె, కుటుంబంతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తోం. కాగా, 2018లో చాలా కాలంగా ప్రేమిస్తున్న రష్యన్ బాయ్ ఫ్రెండ్ ఆండ్రూని వివాహం చేసుకుంది. లాక్ డౌన్ సమయంలో ఎవరికీ తెలియకుండా తల్లై ఓ బిడ్డకు జన్మనిచ్చింది. శ్రియ‌ స్వయంగా చెప్పేవరకు ఈ విషయం ఎవరికీ తెలియదు. రీసెంట్‌గా శ్రియ గ‌మ‌నం, ఆర్ఆర్ఆర్ అనే సినిమాల‌తో ప‌ల‌క‌రించింది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డి ఖాతాలో ప‌లు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Shriya Saran (@shriya_saran1109)

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now