Karate Kalyani : యాంక‌ర్ దేవిని క‌డిగి పారేసిన క‌రాటే క‌ల్యాణి.. విశ్వ‌క్‌కే మ‌ద్ద‌తు.. అనసూయ అలా చేస్తే ఏం చేశారు ?

May 5, 2022 8:13 AM

Karate Kalyani : యాంక‌ర్ దేవీ నాగ‌వ‌ల్లికి, న‌టుడు విశ్వ‌క్ సేన్‌కు మ‌ధ్య జ‌రిగిన మాట‌ల యుద్ధం ఏమోగానీ.. నెటిజ‌న్ల మ‌ద్ద‌తు, సినీ సెల‌బ్రిటీల మద్ద‌తు విశ్వ‌క్ సేన్‌కే ల‌భిస్తోంది. తాజాగా యువ ద‌ర్శ‌కుడు బండి స‌రోజ్ కుమార్ యాంకర్ దేవిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌న మ‌ద్ద‌తు విశ్వ‌క్‌కే అని.. వాడు కాబ‌ట్టి ఆ ప‌దం వాడి స‌రిపెట్టాడు, తానైతే నాలుగు త‌న్నేవాన్ని.. అని ఆయ‌న కామెంట్ చేశారు. దీంతో ఆయ‌న వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుతున్నాయి.అయితే ఈ విష‌యంపై న‌టి క‌రాటే క‌ల్యాణి స్పందించారు. ఆమె త‌న స‌పోర్ట్ విశ్వ‌క్‌సేన్‌కే అని తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. అందులో అన‌సూయ పేరును కూడా ఆమె ప్ర‌స్తావించారు.

Karate Kalyani give support to Vishwak Sen
Karate Kalyani

గ‌తంలో అన‌సూయ చాలా సార్లు ఎఫ్** అనే ప‌దాన్ని వాడింది. సాక్షాత్తూ 3*3 టీవీ డిబేట్‌లోనే ఆమె యాంక‌ర్ దేవి ఎదురుగా ఉండ‌గానే ఆ ప‌దాన్ని అనేసింది. అయితే ప్ర‌స్తుతం వివాదంలో ఆ టీవీ చాన‌ల్ వాళ్ల‌దే త‌ప్పు. నేను విశ్వ‌క్ సేన్‌కే స‌పోర్ట్ చేస్తా. అన‌సూయ అన్ని సార్లు ఎఫ్‌** అనే ప‌దాన్ని వాడిన‌ప్పుడు, నువ్వు రోడ్డు మీద డ్యాన్స్ చేసిన‌ప్పుడు.. ఏమైంది అమ్మ‌.. అంటూ క‌రాటే క‌ల్యాణి.. దేవిని క‌డిగి పారేశారు.

ఇక ప్ర‌ముఖ హేతువాది బాబు గోగినేని కూడా విశ్వ‌క్‌సేన్‌కే మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌డం విశేషం. గ‌తంలో అన‌సూయ ఎఫ్‌** అనే ప‌దాన్ని వాడిన వీడియోను ఆయ‌న షేర్ చేశారు. అది కూడా ఆ చాన‌ల్‌లో యాంక‌ర్ దేవి ఉండ‌గానే.. అన‌సూయ ఆ ప‌దాన్ని వాడింది. కానీ అప్పుడు దేవి ఏమీ అన‌లేదు. దీంతో మ‌హిళ అనే కార్డు వాడి దేవి ఇష్యూను పెద్దది చేస్తుంద‌ని నెటిజ‌న్లు త‌ప్పుబ‌డుతున్నారు. అయితే ఈ వివాదం చివ‌ర‌కు ఎన్ని మ‌లుపులు తిరుగుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now