Anchor Suma : చేతిపై పచ్చ‌బొట్టు వేయించుకున్న సుమ‌.. ఆ పేరు ఎవ‌రిదో తెలుసా ?

May 5, 2022 9:29 AM

Anchor Suma : బుల్లితెర యాంక‌ర్‌గా స‌త్తా చాటుతూ ఇప్పుడు వెండితెర‌పై త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు సిద్ధ‌మైంది సుమ‌. ప్ర‌స్తుతం జ‌య‌మ్మ‌గా తెగ హ‌డావిడి చేస్తోంది. దాదాపు ప‌ద్నాలుగేళ్ల త‌ర్వాత ఈమె సిల్వ‌ర్ స్క్రీన్‌పై జ‌య‌మ్మ‌గా సంద‌డి చేయ‌డానికి సిద్ధ‌మైంది. ప‌క్కా ప‌ల్లెటూరి బ్యాక్ డ్రాప్‌తో తెర‌కెక్కిన జయమ్మ పంచాయితీ మే 6న రిలీజ్ కానుంది. బుధ‌వారం ఈ మూవీ రిలీజ్ ట్రైల‌ర్‌ను సూప‌ర్ స్టార్ మ‌హేష్ చేతుల మీదుగా విడుద‌ల చేశారు. ఇది ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది.

Anchor Suma got tattoo on hand what is it
Anchor Suma

వెన్నెల క్రియేష‌న్స్ పతాకంపై విజ‌య్ కుమార్ క‌లివ‌ర‌పు ద‌ర్శ‌క‌త్వంలో బ‌ల‌గ ప్ర‌కాష్ ఈ సినిమాను నిర్మించారు. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి సంగీత సార‌థ్యం వ‌హించిన ఈ చిత్రానికి అనూష్ కుమార్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్ధమైంది. ఎక్కువ రీచ్ సంపాదించేందుకు నిర్విరామంగా ఇంటర్వ్యూలు, ప్రమోషన్ కార్యక్రమాలో పాల్గొంటోంది సుమ‌. అయితే తాజాగా త‌న చేతిపై వెంక‌న్న అనే ప‌చ్చ‌బొట్టు క‌నిపించ‌గా.. దాని గురించి బ‌దులిచ్చింది.

ఆ పచ్చబొట్టు గురించి తెలియాలంటే జయమ్మ పంచాయతీ సినిమా చూడాల్సిందేనని తెలిపింది. సెకండ్ ఆఫ్ లో దీని వెనుక ఉన్న సీక్రెట్ తెలుస్తుందని చెప్పింది. విజయ్ కుమార్ కలివరపు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సుమ కనకాలతోపాటు ఈ చిత్రంలో పలువురు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సినిమాటోగ్రఫీని అనుష్క కుమార్ అందించగా, ఎడిటర్ రవితేజ గిరిజాల. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై బలగ ప్రకాష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment