Kajal Aggarwal : భారీ షాకిచ్చిన కాజ‌ల్ అగ‌ర్వాల్..? సినిమాల‌కు గుడ్ బై..?

May 4, 2022 10:45 AM

Kajal Aggarwal : క‌లువ క‌ళ్ల సుందరి కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇటీవ‌ల పండంటి మ‌గ బిడ్డకు జ‌న్మ‌నిచ్చిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తోంది. తన బిడ్డను చూసుకుంటూ ఈ ప్రపంచాన్నే మరిచిపోతోంది. తను తొలిసారి అభిమానులకు బేబీ బంప్ ను చూపించినప్పటి నుంచి ఎప్పటి కప్పుడు తన ఆరోగ్య విషయాలను తెలియజేస్తూనే ఉంది. అయితే బిడ్డ పుట్టాక చాలా భావోద్వేగంతో పోస్ట్ పెట్టింది. నా బిడ్డ నీల్‌ను ఈ ప్రపంచంలోకి స్వాగతిస్తున్నందుకు సంతోషిస్తున్నాను. నీల్ పుట్టిన క్షణాల్లోనే తెల్లటి వస్త్రాన్ని ధరింపజేసి నా ఛాతిపై పడుకోబెట్టారు. ఒక్క క్షణం తల్లిగా పట్టలేని ఆనందాన్ని పొందాను. అలాగే లోతైన ప్రేమను పొందగలిగాను.. అని చెప్పుకొచ్చింది.

Kajal Aggarwal may not act in movies now
Kajal Aggarwal

ద‌శాబ్ధ కాలంగా కాజ‌ల్ అగ‌ర్వాల్ త‌న న‌టన‌తో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించింది. పెళ్లి త‌ర్వాత కూడా ప‌లు సినిమాలు చేసింది. అయితే ఆచార్య స‌మ‌యంలో కాజ‌ల్ ప్రెగ్నెంట్ కావ‌డంతో సినిమా పోర్ష‌న్‌ని పూర్తి చేయ‌లేక‌పోయింది. దీంతో ఆమె పాత్ర‌ని పూర్తిగా తొల‌గించారు. గతంలో రిలీజ్ అయిన లాహే.. లాహే.. సాంగ్ లోనూ కాజల్ అగర్వాల్ సందడి చేసింది. టీజర్, ట్రైలర్లలో కాజల్ ఊసే లేదు. సినిమాలో కూడా ఆమె ఎక్క‌డా క‌నిపించ‌లేదు. అయితే త్వ‌ర‌లో కాజ‌ల్ తిరిగి సినిమాలు చేయ‌నుంద‌ని వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ఆమెకు సంబంధించి ఓ వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

కాజ‌ల్ ఏడాది వ‌ర‌కు సినిమాలు చేయ‌ద‌ని, కొడుకే ప్రాణంగా చిన్నారితో గ‌డుపుతుంద‌ని టాక్. వ‌చ్చే ఏడాది సినిమాల షూటింగ్ మొద‌లు పెట్టే ఛాన్స్ ఉంద‌ని కొంద‌రు అంటున్నారు. అయితే ఈమెకు అప్పుడు అవ‌కాశాలు వ‌స్తాయా.. అని సందేహం వ్య‌క్తం చేస్తున్నారు. అలాగే ఆమె ఇక సినిమాలు చేయ‌క‌పోవ‌చ్చ‌ని.. సినీ ఇండ‌స్ట్రీకి గుడ్ బై చెప్పేసిన‌ట్లేన‌ని అంటున్నారు. దీనిపై పూర్తి క్లారిటీ ఎప్పుడు వ‌స్తుందో చూడాలి. ఇక‌ కాజ‌ల్ న‌టించిన ప‌లు చిత్రాలు ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ద‌శలో ఉండ‌గా.. అవి ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now