Acharya Movie : ఓటీటీలోకి ఆచార్య మూవీ వ‌చ్చేస్తోంది.. తేదీ నోట్ చేసి పెట్టుకోండి..!

May 3, 2022 6:28 PM

Acharya Movie : దాదాపు మూడేళ్ల త‌ర్వాత చిరంజీవి న‌టించిన ఆచార్య చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఏప్రిల్ 29న విడుద‌లైన ఈ చిత్రాన్ని కొర‌టాల శివ తెర‌కెక్కించ‌గా.. ఇందులో రామ్ చ‌ర‌ణ్‌, పూజా హెగ్డె ఇత‌ర‌ ముఖ్య పాత్ర‌లు పోషించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత రామ్‌చరణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు మరింతగా పెరిగాయి. పూజా హెగ్డె గ్లామర్‌ తోడు కావ‌డంతో సినిమా మంచి హిట్ అవుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ ఈ మూవీ తొలి షో నుండే నెగెటివ్ టాక్ సంపాదించుకుంది. దీంతో క‌లెక్షన్స్ కూడా బాగా త‌గ్గాయి.

Acharya Movie coming on OTT note that date
Acharya Movie

ఆచార్య సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా స్క్రీన్స్‌లో విడుదలైంది. అంతేకాదు రూ.132.50 కోట్ల టార్గెట్‌తో బాక్సాఫీస్ దగ్గర ఆచార్య బరిలోకి దిగింది. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.29.50 కోట్లు రాబట్టింది. రెండో రోజు రూ.5.15 కోట్లు రాబడితే.. మూడో రోజు ఆదివారం.. రూ.4.07 కోట్లు మాత్రమే వచ్చింది. ఇక నాలుగో రోజు.. ఈ సినిమాకు రూ. 53 లక్షలు మాత్రమే వ‌చ్చాయి. దీంతో ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద‌ నిరాశ పరిచింది. చూస్తుంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా రీచ్ కాద‌ని అర్ధ‌మ‌వుతోంది. అయితే ఈ సినిమా అనుకున్న దానికంటే ముందుగానే ఓటీటీలో వ‌స్తుంద‌ని కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

ఆచార్య మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 20, 2022న రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా రానుంది. ఈ సినిమా విడుద‌లై నెల రోజులు కాక‌ముందే ఆచార్య ఓటీటీలలో రానుండ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. కొణిదెల ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. పూజా హెగ్డె, త‌నికెళ్ల భ‌ర‌ణి, అజ‌య్‌, శ‌త్రు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. మ‌ణిశ‌ర్మ ఆచార్య‌కు సంగీతం అందించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now