Upasana : హ్యాట్సాఫ్ ఉపాసన మేడ‌మ్‌.. నిజంగా మీరు గ్రేట్‌..!

May 2, 2022 9:24 PM

Upasana : మెగా కోడ‌లు ఉపాస‌న కొణిదెల ఈ మ‌ధ్య కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఆమె ఓ వైపు రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి ఆయ‌న సినిమాకు చెందిన కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటూనే మ‌రోవైపు అపోలో హాస్పిట‌ల్స్ బాధ్య‌త‌ల‌ను నెర‌వేరుస్తున్నారు. అలాగే సామాజిక సేవా కార్య‌క్ర‌మాల్లోనూ పాల్గొంటూ అంద‌రిచే మ‌న్న‌న‌లు పొంద‌తున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా ఆమె చేస్తున్న ఓ గొప్ప ప‌ని గురించిన స‌మాచారం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

Upasana praised by netizen for her social work
Upasana

ప్ర‌స్తుతం చాలా మంది సెల‌బ్రిటీలు డ‌బ్బు సంపాదిస్తున్నా అత్యంత దాతృత్వ గుణం ఉన్న‌ది కొంద‌రికే. అలాంటి వారిలో చిరంజీవి ఒక‌ర‌ని చెప్ప‌వ‌చ్చు. ఇప్ప‌టికీ ఆయ‌న ఇంటి నుంచి ల‌క్ష‌ల రూపాయ‌లు స‌హాయం రీత్యా బ‌య‌ట‌కు వెళ్తుంటాయి. ఎంతో మందికి కాదు, లేదు అన‌కుండా చిరంజీవి స‌హాయం చేస్తున్నారు. అయితే ఆయ‌న గుణాల‌నే ఉపాస‌న పుణికి పుచ్చుకున్నారు. ఆమె కూడా ఎన్నో గొప్ప సామాజిక సేవా కార్య‌క్ర‌మాల‌ను చేస్తున్నారు. అందులో భాగంగానే ఆమె తాజాగా ఓ వృద్ధాశ్ర‌మంలో వృద్ధ మ‌హిళ‌ల‌తో స‌ర‌దాగా గ‌డిపారు. ఆ ఫొటోలు వైర‌ల్ అయ్యాయి.

వాస్త‌వానికి ఉపాస‌న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మొత్తం 150కి పైగా వృద్ధాశ్ర‌మాల‌కు చేయూత‌ను ఇస్తున్నార‌ట‌. అందుక‌నే ఆమె అప్పుడ‌ప్పుడు ఆశ్ర‌మాల‌కు వెళ్లి వ‌స్తుంటారు. అక్క‌డ వృద్ధుల‌తో క‌లిసి గ‌డుపుతారు. వారి క‌ష్ట సుఖాల‌ను తెలుసుకుంటారు. వారికి ఆమె క‌న్న బిడ్డ‌లా మారి స‌హాయం చేస్తున్నారు. అందుక‌నే ఉపాస‌న‌ను అంద‌రూ ప్ర‌శంసిస్తుంటారు. ఇక ఉపాస‌న ఈ మ‌ధ్య చ‌ర‌ణ్ సినిమాల‌ను థియేట‌ర్ల‌లో చూసి హంగామా చేశారు. ఆర్ఆర్ఆర్ మూవీ చూస్తూ చ‌ర‌ణ్ ఇంట్ర‌డ‌క్ష‌న్ వ‌చ్చిన‌ప్పుడు ఆమె ఈల‌లు, చ‌ప్ప‌ట్లతో సందడి చేశారు. గాల్లోకి పేప‌ర్ల‌ను విసిరారు. అలాగే ఆచార్య మూవీని చూసి చాలా బాగుంద‌ని చెప్పారు. దీంతో ఆమె పోస్టులు వైర‌ల్ అయ్యాయి. ఇక తాజాగా ఆమె చేస్తున్న సేవ‌ను చూసి ఆమెది ఎంత గొప్ప మ‌న‌సో అని అంద‌రూ అభినందిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now