Ram Gopal Varma : ఆచార్య‌లో ఆ సీన్‌పై ఇన్‌డైరెక్ట్‌గా సెటైర్ వేసిన వ‌ర్మ‌..!

May 2, 2022 8:05 AM

Ram Gopal Varma : కాంట్ర‌వ‌ర్సీస్‌కి కేరాఫ్ అడ్ర‌స్ ఎవ‌రంటే ఠ‌క్కున గుర్తొచ్చే పేరు రామ్ గోపాల్ వ‌ర్మ‌. ఆయ‌న ఒక‌ప్పుడు అద్భుత‌మైన సినిమాల‌తో వార్త‌ల‌లోకి ఎక్కేవారు. ఇప్పుడు మాత్రం వివాదాల‌తో సంచ‌ల‌నంగా మారుతున్నారు. మ‌రోవైపు అన్ని జానర్స్ టచ్ చేస్తూ ఆడియన్స్‌కి కొత్త టేస్ట్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మా ఇష్టం అనే పేరుతో ఇద్ద‌ర‌మ్మాయిల‌ లవ్ స్టోరీని తెరకెక్కించి విడుదలకు సిద్ధం చేశారు. అప్సర రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 8న విడుద‌ల చేయాల‌ని అనుకున్నాడు. కానీ ప‌లు కార‌ణాల వ‌ల‌న వాయిదా ప‌డింది.

Ram Gopal Varma indirect satire on Acharya movie graphics scene
Ram Gopal Varma

థియేటర్స్, మల్టీప్లెక్స్ ల‌కు సంబంధించిన యాజమాన్యాలు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన మా ఇష్టం వంటి వివాదాస్పద చిత్రాన్నిథియేటర్స్‌లో ప్రదర్శించబోమంటూ తెగేసి చెప్పారు. ఒకప్పడు తన సినిమాలతో దేశ వ్యాప్తంగా అందరినీ ఆకట్టుకున్న ఈ దిగ్గ‌జ ద‌ర్శకుడికి ఇంత అవ‌మానం జ‌ర‌గ‌డం ఆయ‌న అభిమానుల‌ని చాలా బాధ‌కి గురి చేసింది. అయితే ఎలాంటి ప‌రిస్థితులు ఎదురైనా తాను మాత్రం త‌న పంథాను మార్చుకోడు. విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తూనే ఉంటాడు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి సంబంధించి సెటైర్స్ వేయ‌డంలో ఓ అడుగు ముందే ఉంటాడు.

ఆచార్య‌లో చిరంజీవి యంగ్ ఏజ్‌ వీఎఫ్ఎక్స్ సీన్‌పై ఎన్ని సెటైర్స్ వ‌చ్చాయో మ‌నం అంద‌రం చూశాం. పాత ఫొటోని తీసుకొని మేక‌ర్స్ ఏదో ప్ర‌య‌త్నాలు చేయ‌గా అది దెబ్బ‌కొట్టింది. ఇప్పుడు అదే స్టైల్‌లో రామ్ గోపాల్ వ‌ర్మ కూడా త‌న‌ ఫోటోను ఎడిట్ చేసి షేర్ చేశాడు. తాను అలాంటి రియాక్షన్ ఎందుకు ఇచ్చానో చెప్పిన వారికి బహుమతి ఇస్తానంటూ వర్మ ఆఫర్ ప్రకటించారు. అయితే ఈ ట్వీట్ ఆచార్య సినిమా గురించే అని కొంద‌రు అంటున్నారు. ఆచార్య వీఎఫ్ఎక్స్ సీన్‌పైనే వ‌ర్మ ఇలా సెటైర్ వేసి ఉంటాడ‌ని చెప్పుకుంటున్నారు. ఆచార్యలో చిరంజీవి యంగ్ ఏజ్ సీన్‌ను చూసే వ‌ర్మ ఇలాంటి రియాక్ష‌న్ ఇచ్చాడ‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే వ‌ర్మ పోస్ట్ వైర‌ల్ అవుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now