Upasana Konidela : ఆచార్య సినిమాపై మెగా కోడ‌లు ఉపాస‌న రియాక్ష‌న్‌.. ఏం పోస్టు పెట్టిందంటే..?

April 30, 2022 7:11 PM

Upasana Konidela : కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వంలో మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ‌, పూజా హెగ్డె, సోనూసూద్‌లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో వ‌చ్చిన మూవీ.. ఆచార్య‌. ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ నాలుగేళ్ల పాటు క‌ష్ట ప‌డింది. చిరంజీవి, కొరటాల శివ 4 ఏళ్ల స‌మ‌యాన్ని ఈ మూవీ కోస‌మే కేటాయించారు. అయితే ఈ సినిమాకు ఫ్లాప్ టాక్ ఎక్కువ‌గా వ‌స్తోంది. దీంతో మెగా ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తికి లోన‌వుతున్నారు. అయితే చిత్ర యూనిట్ మాత్రం స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్ చేస్తోంది. దీంతో ఈ విష‌యంపై కూడా ఫ్యాన్స్ మండిప‌డుతున్నారు. అయితే తాజాగా ఆచార్య మూవీపై మెగా కోడ‌లు ఉపాస‌న స్పందించారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టు పెట్టారు.

Upasana Konidela posted about Acharya movie
Upasana Konidela

రామ్ చ‌ర‌ణ్ న‌టించిన ఆర్ఆర్ఆర్ సినిమా విడుద‌ల సంద‌ర్భంగా ఉపాసన థియేట‌ర్లో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. చ‌ర‌ణ్ తెర‌పై కనిపించిన‌ప్పుడు ఆమె గాల్లోకి పేప‌ర్లు విసురుతూ సంద‌డి చేశారు. అయితే ఆచార్య మూవీ చూశాక మాత్రం ఒక పోస్టుతో స‌రిపెట్టారు. త‌న ఇన్‌స్టా ఖాతాలో ల‌వ్ ల‌వ్ ల‌వ్ ది మూవీ అంటూ.. ఆమె పోస్టు పెట్టారు. దీంతో ఆ పోస్టు వైర‌ల్ అవుతోంది.

అయితే ఆచార్య సినిమాకు నెగెటివ్ టాక్ వ‌స్తుండ‌డంతో అంద‌రూ కొర‌టాల శివ వైపే వేలెత్తి చూపిస్తున్నారు. ఆయన చివ‌రి నిమిషంలో అనేక మార్పులు చేశార‌ని.. అందుక‌నే స‌రిగ్గా రాలేదని.. చిరు, చ‌ర‌ణ్‌ల‌ను ఆయ‌న స‌రిగ్గా ఉప‌యోగించుకోలేక‌పోయార‌ని.. విమ‌ర్శలు వ‌స్తున్నాయి. అయితే ఆయ‌న త్వ‌ర‌లో ఎన్‌టీఆర్‌తో సినిమా చేయ‌నున్న నేప‌థ్యంలో ఆ మూవీని ఎలా తెర‌కెక్కిస్తారు.. అది హిట్ అవుతుందా.. ఆర్ఆర్ఆర్ రాజ‌మౌళి సినిమా క‌నుక.. అందులో న‌టించిన ఎన్‌టీఆర్‌కు కొరటాల సినిమా హిట్‌ను అందిస్తుందా.. లేక సెంటిమెంట్ రిపీట్ అయి మ‌ళ్లీ ఫ్లాప్ అవుతుందా.. అన్న అనుమానాలు వ‌స్తున్నాయి. ఇక ఆ మూవీ విడుద‌లైతే గానీ ఈ అనుమానాలు ప‌టాపంచ‌లు కావు. అప్ప‌టి వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now