Kiara Advani : ప్రియుడితో విడిపోవ‌డంపై స్పందించిన కియారా..!

April 29, 2022 12:59 PM

Kiara Advani : సౌత్‌, నార్త్‌లో దుమ్ము రేపుతున్న అందాల ముద్దుగుమ్మ కియారా అద్వానీ. ఈ అమ్మ‌డికి ఫాలోయింగ్ త‌క్కువేమీ కాదు. భరత్‌ అనే నేను సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన కియారా అద్వానీ కబీర్‌ సింగ్‌ అనే ఒక్క మూవీతో బాలీవుడ్‌లో బ్లాక్‌ బస్టర్‌ హిట్ కొట్టి.. స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌కి చేరుకుంది. గ‌తంలో రామ్ చ‌ర‌ణ్ తో వినయ విధేయ రామలో స్క్రీన్ షేర్ చేసుకుంది కియారా. అది హిట్ కాకపోయినప్పటికీ ఇప్పుడు మ‌ళ్లీ అతనితో క‌లిసి ఓ సినిమా చేస్తోంది. పాన్ ఇండియా మూవీగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి.

Kiara Advani responded over her love breakup news
Kiara Advani

కియారా కొద్ది రోజులుగా సిద్దార్థ్ మ‌ల్హోత్రాతో ప్రేమాయ‌ణం న‌డుపుతున్న విష‌యం తెలిసిందే. అయితే చాలా కాలంగా ల‌వ్‌లో ఉన్న కియారా త‌న బాయ్‌ఫ్రెండ్‌కు బ్రేక‌ప్ చెప్పిన‌ట్టు వ‌స్తున్న వార్త‌లు హాట్ టాపిక్‌గా మారాయి. వీరి బ్రేకప్‌పై బి-టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నా తమకేం పట్టనట్టు వ్యవహరిస్తోంది ఈ జంట. అయితే వీరిద్దరి మధ్య దూరం పెరిగింది. కానీ అది గొడవల వల్ల కాదని, షూటింగ్‌లో బిజీగా ఉండడం వల్ల.. అంటూ.. అందరినీ ఆలోచనలో పడేశారు ఈ జంట మ్యూచువల్‌ ఫ్రెండ్స్‌. తాజాగా త‌మ‌ బ్రేకప్‌ వార్తలపై కియారా అద్వానీ స్పందించింది.

తాజాగా జరిగిన భూల్ భూలయ్యా 2 ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ఈ విష‌య్ంపై ఇన్‌డైరెక్ట్‌గా ప్రశ్న వేశాడు ఓ జర్నలిస్ట్. మీరు ఎవరినైనా మరిచిపోవాలని అనుకుంటున్నారా ? అని అడ‌గ‌గా, దీనికి కియారా కూడా చాలా తెలివిగా సమాధానం చెప్పింది. ప్ర‌తి ఒక్క‌రు నా జీవితంలో ఇంపార్టెంట్‌. ఎవ‌రినీ మ‌ర‌చిపోవాల‌ని అనుకోవ‌ట్లేదు.. అంటూ బ‌దులిచ్చింది. ఇదిలా ఉండ‌గా ఇద్దరూ కలిసి పార్టీల్లో చెట్టాపట్టాలేసుకు తిరగడం, హలీడే వెకేషన్‌కు వెళ్లడం, బర్త్ డే వేడుకల్లో ఎంజాయ్ చేస్తుండడంతో ఇద్ద‌రి మ‌ధ్య ఏదో న‌డుస్తుంద‌ని ప్ర‌చారం చేసిన విష‌యం తెలిసిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now