Uday Kiran : ఉద‌య్ కిర‌ణ్ చివ‌రి మాటలు వింటే.. క‌న్నీళ్లు పెట్టుకుంటారు..!

April 28, 2022 10:51 AM

Uday Kiran : టాలీవుడ్ లవ‌ర్ బాయ్‌గా తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్న హీరో ఉద‌య్ కిర‌ణ్‌. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా స్వ‌యంకృషితో టాప్ హీరోగా ఎదిగాడు. టాలీవుడ్ లో అతి తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోలతోపాటు హీరోల వారసులకి ముచ్చెమటలు పట్టించాడు హీరో ఉదయ్ కిరణ్. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్‌లో 2000వ‌ సంవత్సరంలో వచ్చిన చిత్రం సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన ఉద‌య్ కిర‌ణ్ ఈ సినిమాతో తెగ మెప్పించాడు. తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రీమాసేన్ హీరోయిన్ గా నటించింది. రెండో సినిమా కూడా తేజ దర్శకత్వంలో నువ్వునేనులో నటించిన ఉదయ్ కిరణ్ ఆ సినిమాతో మరో సూపర్ హిట్ కొట్టాడు.

Uday Kiran last words will make you cry
Uday Kiran

నువ్వు నేను చిత్రంతో ఉద‌య్ కిర‌ణ్ క్రేజ్ అమాంతం పెరిగింది. ఈ సినిమా అప్పట్లో తెలుగునాట కాలేజీ యూత్ ను ఒక ఊపు ఊపేసింది. నువ్వు నేను సినిమా వచ్చిన వెంటనే మనసంతా నువ్వే సినిమాతో ఉదయ్ కిరణ్ హ్యాట్రిక్ హిట్ కొట్టాడు. మ‌నసంతా నువ్వేలో సైతం ఉదయ్‌కిరణ్ తొలి సినిమా చిత్రం హీరోయిన్ రీమాసేన్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పై ఎం.ఎస్.రాజు నిర్మాతగా వీఎన్ ఆదిత్య‌ దర్శకత్వంలో తెర‌కెక్కింది. ఈ చిత్రం ప్ర‌తి ఒక్క‌రినీ ఎంత‌గానో అల‌రించింది. ఉద‌య్ త‌న అందంతో ల‌వ‌ర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకుని అమ్మాయిల మ‌న‌సు దోచుకున్నాడు.

ఉద‌య్ కిర‌ణ్ గ్రాఫ్ ఎంతగా పెరిగిందో అంతే ఫాస్ట్‌గా కింద‌కు ప‌డిపోయింది. చేసిన సినిమాలు వ‌రుస‌గా ఫ్లాప్ కావ‌డంతో ఉద‌య్ డీలా ప‌డ్డాడు. విశిత అనే సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ ను ప్రేమ‌వివాహం చేసుకున్న ఉద‌య్.. పెళ్లి త‌రువాత పెద్ద‌గా రాణించ‌లేక‌పోయాడు. దాంతో పూర్తిగా డిప్రెష‌న్ లోకి వెళ్లిన ఉద‌య్ కిర‌ణ్ చివ‌రికి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. అయితే చ‌నిపోయే ముందురోజు ఉద‌య్ త‌న‌తో మాట్లాడాడ‌ని వీఎన్ ఆదిత్య చెప్పారు. తాను బెంగుళూరులో భార్య‌తో క‌లిసి ప‌బ్ లో ఎంజాయ్ చేస్తున్నాన‌ని చెప్పాడ‌ని అన్నారు. మ‌ళ్లీ ఇద్ద‌రం క‌లిసి ప‌నిచేద్దామ‌న్నా అంటూ త‌న‌తో అన్నాడ‌ని.. త‌న‌కు ధైర్యం చెప్పాడ‌ని.. తెలిపాడు. ఆయ‌న మాట‌లు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయ‌ని చెప్పాడు. అయితే అంత స‌డెన్‌గా అలాంటి నిర్ణ‌యాన్ని ఉద‌య్ ఎందుకు తీసుకున్నాడో అర్థం కాలేద‌ని అన్నారు. కాగా ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now