Keerthy Suresh : కోట్లు ఇచ్చినా.. ఆ ప‌ని చేయ‌ను.. కీర్తి సురేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

April 24, 2022 10:16 AM

Keerthy Suresh : నేను శైల‌జ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌. చూడ చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యంతో ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్న కీర్తి మ‌హాన‌టి నేష‌న‌ల్ అవార్డ్ కూడా ద‌క్కించుకుంది. ఇక ఆ సినిమా నుండి కీర్తి హ‌వాకి తిరుగు లేకుండా పోయింది. స్టార్ హీరోల స‌ర‌స‌న వ‌రుస ఆఫ‌ర్స్ అందిపుచ్చుకుంటూ దూసుకుపోతుంది. ప్రస్తుతం సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు సరసన సర్కారు వారి పాట సినిమాలో నటిస్తోంది.

Keerthy Suresh sensational comments about her acting
Keerthy Suresh

మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్‌కు ఏ సినిమా కూడా పెద్ద‌గా సక్సెస్‌ను ఇవ్వలేదు. ఇప్పుడు తన తదుపరి చిత్రాలపైనే ఆశలు పెట్టుకుంది కీర్తి సురేష్‌. సర్కారు వారి పాట చిత్రం మే 12న విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ముందే కీర్తి సురేష్‌ మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కీర్తి సురేష్‌ తాజాగా నటించిన చిత్రం సాని కాయిదమ్‌. ఈ చిత్రాన్ని తెలుగులో చిన్ని పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా మే 6న చిన్ని మూవీ రిలీజ్ కానుంది.

ఈ సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా కీర్తి సురేష్ గ్లామ‌ర్ పాత్ర‌ల‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. మొద‌టి నుండి తాను న‌ట‌న‌పైనే దృష్టి పెట్టాన‌ని చెప్పుకొచ్చింది. గ్లామ‌ర్ విష‌యంలో తాను కొన్ని ప‌రిమితులు పెట్టుకున్నాన‌ని చెప్పిన కీర్తి సురేష్ వాటిని అధిగ‌మించ‌ను అని అంటోంది. త‌న ఆలోచ‌నా విధానం, త‌న న‌ట‌న న‌చ్చిన ప్రేక్ష‌కులు త‌ప్ప‌కుండా చూస్తార‌ని ధీమా వ్య‌క్తం చేసింది. కోట్లు ఇచ్చినా తాను గ్లామ‌ర్ షోకు దూరంగానే ఉంటాన‌ని.. ఎట్టి ప‌రిస్థితిలోనూ ఆ ప‌ని చేయ‌న‌ని ఈమె స్ప‌ష్టం చేసింది. ప్ర‌స్తుతం కీర్తి సురేష్ క‌థానాయిక‌గానే కాకుండా స‌పోర్టింగ్ రోల్స్‌లో క‌నిపించి ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. చిరంజీవితో భోళా శంకర్‌, నానికి జోడీగా దసరా చిత్రాల్లో నటిస్తోంది. మరిన్ని ప్రాజెక్టులు ఆమె ఖాతాలో ఉన్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now