బ్లాక్ ఫంగ‌స్, వైట్ ఫంగ‌స్‌.. ఇప్పుడు కోవిడ్ పేషెంట్ల‌కు కొత్త‌గా యెల్లో ఫంగ‌స్‌..

May 24, 2021 6:11 PM

క‌రోనా బారిన ప‌డి కోలుకుంటున్న వారితోపాటు పూర్తిగా కోలుకున్న వారిలో కొంద‌రికి బ్లాక్ ఫంగ‌స్ వ‌స్తున్న విష‌యం విదిత‌మే. అయితే నిన్న మొన్న‌టి వ‌ర‌కు వైట్ ఫంగ‌స్ కేసులు కూడా వ‌చ్చాయి. ఇక ఇప్పుడు తాజాగా యెల్లో ఫంగ‌స్ వ్యాప్తి చెందుతున్న‌ట్లు నిర్దారించారు. కోవిడ్ బారిన ప‌డిన ఓ వ్య‌క్తికి యెల్లో ఫంగ‌స్ వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఘ‌జియాబాద్‌లో యెల్లో ఫంగ‌స్ మొద‌టి కేసు న‌మోదైంది.

after black and white fungus yellow fungus case is reported in india

ఘ‌జియాబాద్‌లో ఉన్న ఓ ఈఎన్‌టీ హాస్పిట‌ల్‌లో యెల్లో ఫంగ‌స్ సోకిన వ్య‌క్తికి ప్ర‌స్తుతం చికిత్స అందిస్తున్నారు. అయితే బ్లాక్‌, వైట్ ఫంగ‌స్‌ల క‌న్నా యెల్లో ఫంగ‌స్ అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైంద‌ని నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ బారిన ప‌డిన వ్య‌క్తి ప‌రిశుభ్ర‌త‌ను పాటించ‌క‌పోతే యెల్లో ఫంగ‌స్ వ‌చ్చే ప్ర‌మాదం ఉంటుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు.

యెల్లో ఫంగ‌స్ బారిన ప‌డిన వారిలో బ‌ద్ద‌కం, ఆక‌లి లేక‌పోవ‌డం లేదా త‌క్కువ ఆక‌లి ఉండ‌డం, బ‌రువు వేగంగా త‌గ్గ‌డం, గాయాలు త్వ‌ర‌గా మాన‌క‌పోవ‌డం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. క‌నుక ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే వెంట‌నే డాక్ట‌ర్‌ను సంప్ర‌దించి చికిత్స తీసుకోవాల‌ని సూచిస్తున్నారు. అలాగే కోవిడ్ వ‌చ్చిన వారు ఈ ఫంగ‌స్ బారిన ప‌డ‌కుండా ఉండాలంటే ప‌రిశుభ్ర‌త‌ను పాటించాల‌ని హెచ్చ‌రిస్తున్నారు. ఇక యెల్లో ఫంగ‌స్ వ‌చ్చిన‌వారికి యాంఫోటెరిసిన్ బి అనే ఇంజెక్ష‌న్ ప‌నిచేస్తుందని తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now