Anushka Shetty : ఎన్నాళ్ల‌కెన్నాళ్ల‌కు.. క్యూట్ ఫొటోల‌తో అనుష్క పోస్ట్‌.. వైర‌ల్‌..!

April 21, 2022 12:29 PM

Anushka Shetty : తెలుగు ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు అనుష్క శెట్టి. సూప‌ర్ సినిమాతో టాలీవుడ్‌కి ప‌రిచ‌య‌మైన అందాల ముద్దుగుమ్మ లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకుంది. అనతి కాలంలోనే దక్షిణాదిలో టాప్ హీరోయిన్ హోదా పొందిన అనుష్క నిశ్శ‌బ్ధం సినిమా త‌ర్వాత మ‌రో సినిమా చేయ‌లేదు. ఇటీవ‌ల ఆమె బర్త్ డే సందర్భంగా ఒక‌ ప్రకటన విడుదలవ్వగా.. ఈ సినిమాలో హీరోగా నవీన్ పొలిశెట్టి చేస్తున్నాడ‌ని తెలియ‌జేసింది టీమ్. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించనుంది.

Anushka Shetty after long back post on social media
Anushka Shetty

యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమాకు పి.మహేష్ బాబు దర్శకత్వం వహించనున్నారు. అనుష్క ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఈ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాకు మిస్ శెట్టి.. మిస్టర్.. పోలిశెట్టి.. అనే టైటిల్ నిర్ణయించారని అంటున్నారు. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. అయితే అనుష్క సోష‌ల్ మీడియాలో అంత‌గా యాక్టివ్‌గా ఉండ‌ద‌నే సంగ‌తి మ‌నంద‌రికీ తెలిసిందే. అప్పుడ‌ప్పుడూ ఆస‌క్తికర పోస్ట్‌లు పెడుతుంటుంది. తాజాగా తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ విషెస్ తెలిపింది.

త‌న తండ్రితో స‌ర‌దాగా దిగిన ఫొటోల‌ను క‌లిపి ఒక ఫొటోగా మార్చి షేర్ చేసిన అనుష్క‌.. సంవత్సరాలు గడుస్తూనే ఉంటాయి. నాకు ఎంత వయసొచ్చినా.. నేనెప్పటికీ మీ క్యూట్ చిన్నపిల్లనే. హ్యాపీ బర్త్ డే పాపా.. అంటూ తన తండ్రికి క్యూట్‌గా విషెస్ తెలిపింది అనుష్క. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనుష్క కేవ‌లం కమర్షియల్ సినిమాలతోనే కాదు.. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో కూడా పాపులారిటీ సంపాదించుకుంది. ఇప్పటికీ అనుష్కను హీరోయిన్‌గా పెట్టి భారీ బడ్జెట్ లేడీ ఓరియెంటెడ్ సినిమాలను తెరకెక్కించాలని ఎంతో మంది దర్శకులు ఎదురుచూస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now