Sri Reddy : క‌డ‌క్‌నాథ్ కోడి కూర అలా వండితే.. మ‌గాళ్ల‌లో క‌రెంట్ పెరుగుతుంద‌న్న శ్రీ‌రెడ్డి.. వీడియో వైర‌ల్‌..!

April 21, 2022 9:28 AM

Sri Reddy : మెగా ఫ్యామిలీ అంటే అంతెత్తున విరుచుకు ప‌డే శ్రీ‌రెడ్డి ఈ మ‌ధ్య కాలంలో సోష‌ల్ మీడియాలో చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. త‌న అప్‌డేట్స్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు షేర్ చేస్తూ సంద‌డి చేస్తోంది. మ‌ధ్య మ‌ధ్య‌లో త‌నంటే గిట్ట‌ని వాళ్ల‌కు కౌంట‌ర్లు కూడా వేస్తోంది. ఇప్ప‌టికే ఎంతో మంది ఫాలోవ‌ర్ల‌ను సంపాదించుకున్న శ్రీ‌రెడ్డి ప్ర‌స్తుతం యూట్యూబ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్ప‌టిక‌ప్పుడు వంట‌ల వీడియోల‌తో అల‌రిస్తోంది. ఈ మ‌ధ్యే మ‌ట‌న్‌, చేప‌లు, పీత‌ల కూర‌ల‌తో అద‌ర‌గొట్టింది. ఇక తాజాగా ఈమె కోడికూర వండింది. అయితే అది సాదా సీదా కోడి కాదు.. క‌డ‌క్ నాథ్ కోడి. అదేనండీ.. శ‌రీరం మొత్తం ఈక‌ల‌తో స‌హా న‌ల్ల‌గా ఉంటుంది క‌దా.. అదే కోడి. ఆ కోడి కూర‌నే శ్రీ‌రెడ్డి తాజాగా వండింది.

Sri Reddy cooked Kadaknath chicken curry video viral
Sri Reddy

క‌డక్‌నాథ్ కోళ్ల‌కు దేశంలో ఉన్న డిమాండ్ గురించి అంద‌రికీ తెలిసిందే. ఈ కోళ్లు చాలా ఎక్కువ ధ‌ర‌ను క‌లిగి ఉంటాయి. సాధారణ కోళ్ల‌తో పోలిస్తే వీటిని కొద్దిగా ఎక్కువ రోజుల పాటు పెంచాలి. ఇక ఈ కోళ్ల‌లో కొవ్వు చాలా త‌క్కువ‌గా.. పోష‌కాలు అధికంగా ఉంటాయి. అందుక‌నే ఈ కోళ్ల‌కు ధ‌ర కాస్త ఎక్కువ‌గానే ఉంటుంది. వీటి గుడ్లు కూడా ఎక్కువ ధ‌ర‌నే క‌లిగి ఉంటాయి. అయితే శ్రీ‌రెడ్డి తాజాగా క‌డ‌క్‌నాథ్ కోళ్ల‌ను వండింది. ఈమె చేసిన కోడికూర చూస్తుంటే నోట్లో నీళ్లూరిపోతున్నాయి. ఈ కోళ్ల‌ను ఎలా వండాలో కూడా శ్రీ‌రెడ్డి తెలియ‌జేసింది.

https://youtu.be/ToyemCg1xB0

క‌డ‌క్‌నాథ్ కోళ్ల స‌హ‌జంగానే సాధార‌ణ కోళ్ల క‌న్నా రుచిగా ఉంటాయి. క‌నుక వాటిని సరైన ప‌దార్థాల‌తో వండితే కూర ఇంకా టేస్టీగా ఉంటుంది. అందుకు గాను ఈ కోడికూర‌ను కొబ్బ‌రిపాల‌తో వండాల‌ని శ్రీ‌రెడ్డి చెప్పింది. అప్పుడు రుచి ఇంకా పెరుగుతుంద‌ని తెలియ‌జేసింది. ఇలా ఈ కోడితో కూర వండి పురుషులు తింటే వారిలో క‌రెంట్ పెరుగుతుంద‌ని చెప్పింది. ఇది వారికి ఔష‌ధంలా ప‌నిచేస్తుంద‌ని తెలియ‌జేసింది. ఈ క్ర‌మంలోనే శ్రీ‌రెడ్డి వండిన క‌డ‌క్‌నాథ్ కోడి కూర వీడియో నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. అంద‌రూ ఆ కోడికూర‌ను తినాల‌ని ఉంద‌ని కామెంట్లు చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now