OTT : ఈ వారం ఓటీటీల‌లో సంద‌డి చేయ‌నున్న చిత్రాలేంటో తెలుసా ?

April 18, 2022 6:13 PM

OTT : ప్ర‌తి శుక్రవారం థియేట‌ర్‌ల‌లో చాలా సినిమాలు సంద‌డి చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇక ఇప్పుడు థియేట‌ర్స్ క‌న్నా ఓటీటీలో మంచి వినోదం పంచేందుకు ప‌లు చిత్రాలు సిద్ధ‌మ‌వుతున్నాయి. ఇందులో భాగంగా ఈ వారం ప‌లు చిత్రాలు ఓటీటీలో అల‌రించేందుకు సిద్ధ‌మయ్యాయి. ఈ వారం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్ల‌స్‌ హాట్‌స్టార్, జీ5, ఇతర ఒటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమ్ కానున్న సినిమాల‌ జాబితాని ప‌రిశీలిస్తే.. వ‌రుణ్ తేజ్ నటించిన గ‌ని.. బాక్సాఫీస్ పరంగా వాష్ అవుట్ అయ్యింది. ఈ చిత్రం బాక్సింగ్ డ్రామాగా ప్రచారం చేయబడింది. ఇది థియేటర్‌ల‌లో ప్రవేశించిన సరిగ్గా 2 వారాల తర్వాత ఈ నెల 22న ఆహా యాప్‌లో వస్తోంది.

movies and series streaming on OTT apps on 22nd April 2022
OTT

ఇంగ్గిష్ కామెడీ ఓరియెంటెడ్ క్రైమ్ డ్రామా సిరీస్ బెట‌ర్ కాల్ సౌల్ సీజ‌న్ 6 ఈ నెల 19వ తేదీన నెట్‌ఫ్లిక్స్‌లో ప్ర‌సారం కానుంది. ఇక ఓ మై డాగ్ చిత్రం ఏప్రిల్ 21వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్ర‌సారం కానుంది. ఇందులో తండ్రీ కొడుకులు అరుణ్ విజయ్, అర్నవ్ విజయ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టించారు. ఇక త‌మిళ డ్రామా అనంతం చిత్రం ఏప్రిల్ 21వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో వస్తోంది. అనంతం అనే తమిళ భాషా చిత్రంలో ప్రకాష్ రాజ్, సంపత్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇది ఈ నెల 22న జీ5లో ప్రీమియర్ అవుతోంది.

అన్‌చార్టెడ్ అనేది టామ్ హాలండ్, మార్క్ వాల్‌బర్గ్, ఇతరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఆంగ్ల భాషా యాక్షన్ అడ్వెంచర్ చిత్రం. ఏప్రిల్ 26న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్‌గా ప్రదర్శించబడ‌నుంది. ఇది ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీల‌లో ప్రసారం కానుంది. ఇలా ప‌లు సినిమాలు, సిరీస్‌లు ఈ వారం ఓటీటీల‌లో తెగ సంద‌డి చేయ‌బోతున్నాయి. వీటి కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment