Krishna : సూప‌ర్ స్టార్ కృష్ణ‌కు ఏమైంది..? ఆందోళ‌న‌లో ఫ్యాన్స్‌..!

April 15, 2022 4:00 PM

Krishna : సూప‌ర్ స్టార్ కృష్ణ గురించి ఎవ‌రికీ పెద్ద‌గా ప‌రిచ‌యం చేయాల్సిన ప‌నిలేదు. అల‌నాటి స్టార్ హీరోల‌లో ఆయ‌న ఒక‌రు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కృష్ణ‌కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయ‌న తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి క‌ల‌ర్‌ను ప‌రిచ‌యం చేశారు. ఆయన అప్ప‌ట్లో క‌ల‌ర్ సినిమాను తీశాక తెలుగులో ఆ ట్రెండ్ మొద‌లైంది. త‌రువాత స్కోప్ సినిమా అని.. జేమ్స్ బాండ్ సినిమా.. అని.. ఇలా ర‌క‌ర‌కాల స‌దుపాయాల‌ను.. సినిమాల‌ను ఆయ‌న టాలీవుడ్‌కు ప‌రిచ‌యం చేశారు. త‌రువాత అన్నింటిలోనూ నంబ‌ర్ వ‌న్ అయ్యారు. ఇక అదే సూప‌ర్ స్టార్ బిరుదును ఆయ‌న త‌న‌యుడు మ‌హేష్ బాబు స్వీక‌రించి ఫ్యాన్స్‌ను అల‌రిస్తున్నారు.

what happened to Krishna fans worry very much
Krishna

అయితే కృష్ణకు ప్ర‌స్తుతం తీవ్ర‌మైన వృద్ధాప్యం వ‌చ్చేసింది. దీంతో ఆయ‌న ఇంటికే పరిమితం అయ్యారు. బ‌య‌ట ఎక్కువ‌గా క‌నిపించ‌డం లేదు. ఏవైనా ఫ్యామిలీ ఫంక్ష‌న్స్ ఉంటే త‌ప్ప ఆయ‌న బ‌య‌ట‌కు రావ‌డం లేదు. అయితే తాజాగా ఆయ‌న ఓ ఫంక్ష‌న్‌కు హాజ‌రు కాగా.. అక్క‌డ ఆయ‌న‌ను తీసిన ఫొటో ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. దాన్ని ఆయ‌న కుమార్తె, మ‌హేష్ సోద‌రి మంజుల పోస్ట్ చేశారు. అయితే ఆ ఫొటోలో కృష్ణ‌ను చూసి అంద‌రూ షాక్ అవుతున్నారు. వృద్ధాప్యం కాకుండా ఆయ‌న అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌ట్లు ఆ ఫొటోను చూస్తే తెలుస్తోంది.

అయితే కృష్ణ‌కు సంబంధించిన లేటెస్ట్ ఫొటోను చూసిన ఆయ‌న ఫ్యాన్స్ ఆందోళ‌న చెందుతున్నారు. ఆయ‌న‌కు ఏమైంది ? అని ఆరాలు తీస్తున్నారు. కృష్ణ‌కు తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్నాయేమోన‌ని.. అందుక‌నే ఆయ‌న అలా అయిపోయారా.. అని ఫ్యాన్స్ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. అయితే కృష్ణ సాధార‌ణంగా బ‌య‌ట క‌నిపించ‌రు. కానీ ఉన్న ప‌ళంగా ఆయ‌న ఇలా క‌నిపించే స‌రికి ఫ్యాన్స్‌కు ఆందోళ‌న ఎక్కువ‌వుతోంది. అయితే దీనిపై ఆయ‌న కుటుంబ స‌భ్యులు స్పందిస్తారేమో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now