KGF Stars Remuneration : కేజీఎఫ్ 2 కోసం హీరో య‌ష్‌.. ఇత‌రులు ఎంత రెమ్యున‌రేష‌న్‌ను తీసుకున్నారో తెలుసా..?

April 14, 2022 8:57 AM

KGF Stars Remuneration : కేజీఎఫ్ చాప్ట‌ర్ 1 మూవీ 2018లో విడుద‌లై సంచ‌ల‌నాల‌ను సృష్టించింది. బాక్సాఫీస్ వ‌ద్ద బంప‌ర్ హిట్ అవ‌డ‌మే కాకుండా.. రికార్డులను బ‌ద్ద‌లుకొట్టింది. భారీగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయి కన్న‌డ సినిమా ఖ్యాతిని పెంచింది. ఇక ఇప్పుడు అవే అంచ‌నాల‌తో మ‌ళ్లీ కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 ను రిలీజ్ చేశారు. గురువారం ఈ సినిమా భారీ ఎత్తున ప్ర‌పంచ‌వ్యాప్తంగా సుమారుగా 10వేల స్క్రీన్‌ల‌లో రిలీజ్ అయింది. ఈ మూవీ కోసం ప్రేక్ష‌కులు ఎప్ప‌టి నుంచో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అందులో భాగంగానే ఎట్టకేల‌కు సినిమా విడుద‌ల కావ‌డంతో.. థియేట‌ర్ల‌కు వారు క్యూ క‌డుతున్నారు. ఇక సినిమాకు చెందిన టాక్ పాజిటివ్‌గానే వ‌స్తోంది. దీంతో య‌ష్ ఇంకో హిట్‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడ‌ని అంటున్నారు.

KGF Stars Remuneration know how much they took
KGF Stars Remuneration

అయితే కేజీఎఫ్ చాప్ట‌ర్ 2కు చెందిన ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేమిటంటే.. ఈ మూవీ కోసం హీరో య‌ష్‌తోపాటు ఇత‌ర న‌టీన‌టులు, సిబ్బంది ఎంత రెమ్యున‌రేష‌న్‌ను తీసుకుని ఉంటారు ? అని ప్రేక్ష‌కులు ఆరాలు తీస్తున్నారు. ఇక ఆ వివ‌రాల‌నే ఇప్పుడు తెలుసుకుందాం.

కేజీఎఫ్ లో రాకీగా అల‌రించిన య‌ష్ ఈ సినిమాకు రూ.27 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. అలాగే సంజ‌య్ ద‌త్ ఇందులో అధీరా పాత్ర‌లో క‌నిపించారు. ఇందుకు ఈయ‌న రూ.9 కోట్లు తీసుకున్న‌ట్లు స‌మాచారం. అలాగే భార‌త ప్ర‌ధాని పాత్ర‌లో న‌టించిన ర‌వీనా టాండ‌న్ రూ.2 కోట్లు తీసుకుంద‌ని తెలుస్తోంది.

ఇక చిత్ర ద‌ర్శ‌కుడు ప్రశాంత్ నీల్ రూ.20 కోట్ల మొత్తం అందుకున్న‌ట్లు స‌మాచారం. హీరోయిన్ శ్రీ‌నిధి రూ.4 కోట్లు, ప్ర‌కాష్ రాజ్ రూ.82 లక్ష‌లు, చాప్ట‌ర్ 1 న‌టుడు అనంత్ నాగ్ రూ.50 ల‌క్ష‌లు, మాళ‌విక అవినాష్ రూ.60 ల‌క్ష‌ల రెమ్యున‌రేష‌న్ తీసుకున్న‌ట్లు స‌మాచారం. ఇక కేజీఎఫ్ 2 మూవీకి ఎక్క‌డ చూసినా ప్రేక్ష‌కుల నుంచి భారీగానే స్పంద‌న వ‌స్తోంది. తెలుగు ప్రేక్ష‌కులు కూడా కేజీఎఫ్ 1 మాదిరిగానే చాప్ట‌ర్ 2ను కూడా ఆద‌రిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment