IPL 2022: హమ్మ‌య్య‌.. ఎట్ట‌కేల‌కు గెలిచిన చెన్నై.. ఊపిరిపీల్చుకుందిగా..!

April 12, 2022 11:38 PM

IPL 2022: ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదిక‌గా జరిగిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2022 టోర్నీ 22వ మ్యాచ్‌లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టుపై చెన్నై విజ‌యం సాధించింది. చెన్నై నిర్దేశించిన భారీ ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు బెంగ‌ళూరు చివ‌రి వ‌ర‌కు పోరాడింది. కానీ ల‌క్ష్య సాధ‌న‌కు కొన్ని ప‌రుగుల దూరంలో ఆగిపోయింది. దీంతో బెంగ‌ళూరుపై చెన్నై 23 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. ఎట్ట‌కేల‌కు చెన్నై ఈ సీజ‌న్‌లో బోణీ కొట్టింది. దీంతో చెన్నై ఫ్యాన్స్ హమ్మ‌య్య‌.. అని ఊపిరి పీల్చుకుంటున్నారు.

IPL 2022 Chennai beat Bangalore by 23 runs in 22nd match
IPL 2022

మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగ‌ళూరు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా.. చెన్నై బ్యాటింగ్ చేసింది. ఈ క్ర‌మంలోనే చెన్నై జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 216 ప‌రుగులు చేసింది. చెన్నై బ్యాట్స్‌మెన్‌ల‌లో శివ‌మ్ దూబె 95 ప‌రుగులు చేసి రెచ్చిపోగా.. చివ‌రికి నాటౌట్‌గా మిగిలాడు. అలాగే రాబిన్ ఊత‌ప్ప కూడా 88 ప‌రుగులు చేసి జట్టుకు భారీ స్కోరును అందించ‌డంలో కీల‌క‌పాత్ర పోషించాడు. ఇక బెంగ‌ళూరు బౌల‌ర్ల‌లో హ‌స‌రంగ 2 వికెట్లు తీయ‌గా.. హేజ‌ల్‌వుడ్‌కు 1 వికెట్ ద‌క్కింది.

అనంత‌రం బ్యాటింగ్ చేసిన బెంగ‌ళూరు 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 193 ప‌రుగులు చేసింది. చివ‌రి ఓవ‌ర్ వ‌ర‌కు బెంగ‌ళూరు బ్యాట్స్‌మెన్ అద్భుత‌మైన ఆట‌తీరును క‌న‌బ‌రిచారు. వికెట్లు ప‌డుతున్నా స్కోర్ బోర్డ్‌ను ఉర‌కలెత్తించా. కానీ చివ‌రికి చేయాల్సిన ప‌రుగులు భారీగా పెరిగిపోయాయి. దీంతో బ్యాట్స్‌మెన్ చివ‌ర్లో చేతులెత్తేశారు. ఈ క్ర‌మంలో చెన్నై జ‌ట్టును విజ‌యం వ‌రించింది. ఇక బెంగళూరు బ్యాట్స్‌మెన్‌ల‌లో షాబాజ్ అహ్మ‌ద్ (41 ప‌రుగులు), సూయాష్ ప్ర‌భుదేశాయ్‌, దినేష్ కార్తీక్‌లు చెరో 34 ప‌రుగుల చొప్పున చేశారు. మిగిలిన ఎవ‌రూ ఆక‌ట్టుకోలేక‌పోయారు. ఇక చెన్నై బౌల‌ర్ల‌లో మ‌నీష్ 4 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. ర‌వీంద్ర జ‌డేజా 3 వికెట్లు తీశాడు. ముకేష్ చౌద‌రి, బ్రేవోల‌కు చెరొక వికెట్ ద‌క్కింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now