Kriti Sanon : జిమ్‌లో చెమ‌ట‌లు కారుస్తున్న కృతి స‌న‌న్.. వీడియో..!

April 12, 2022 3:17 PM

Kriti Sanon : కృతి స‌న‌న్.. ఈ అమ్మ‌డు గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. డైరెక్టర్ సుకుమార్, సూపర్ స్టార్ మహేష్‌ కాంబినేషన్ లో వచ్చిన వన్ నేనొక్కడినే మూవీతో తెలుగుప్రేక్షకులను పలకరించింది కృతి సనన్. ఈ సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్నది. సోషల్ మీడియాలోనూ తెగ యాక్టివ్ గా ఉంటుంది కృతి. ప్రస్తుతం ప్రభాస్‌తో ఆదిపురుష్ లో సీతగా నటిస్తున్న కృతి సనన్ తెగ సంద‌డి చేస్తోంది. బాలీవుడ్‌లో అల‌రిస్తున్న కృతి స‌న‌న్ ఫొటో షూట్ లు చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తోంది.

Kriti Sanon work outs in gym video viral
Kriti Sanon

తెలుగులో రెండు సినిమాల్లో మెరిసిన కృతి సనన్ ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తోంది. బచ్చన్‌ పాండే, షేహజాదా, బేదియా, గణపత్‌, ఆదిపురుష్ చిత్రాల్లో నటిస్తోంది ఈ బ్యూటీ. వీటితోపాటు చాలా రోజుల తర్వాత తెలుగులోకి రీఎంట్రీ ఇస్తూ ఆదిపురుష్‌ చిత్రంలో నటిస్తోంది. ఇందులో ఆమె సీత పాత్రలో కనిపిస్తుండటం విశేషం. ఈ సినిమా ఆగస్ట్ 11న విడుదల కానుంది. ఇదిలా ఉండ‌గా కృతి స‌న‌న్ తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో క‌స‌ర‌త్తుల‌కి సంబంధించిన వీడియోను షేర్ చేసింది. ఇందులో అనేక ర‌కాల వ‌ర్క‌వుట్స్ చేస్తూ క‌నిపించింది.

 

View this post on Instagram

 

A post shared by Kriti (@kritisanon)

జిమ్‌లో క‌స‌ర‌త్తులు చేస్తూ ఎప్ప‌టిక‌ప్పుడు అల‌రిస్తూ ఉండే కృతి.. త‌న అంద‌చందాల‌తో ఆక‌ట్టుకుంటోంది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన కృతి సనన్ హీరోయిన్ అయ్యింది తెలుగు సినిమాతోనే. 2014లో మహేష్-సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన వన్ నేనొక్కడినే చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. భారీ అంచలనాల మధ్య విడుదలైన నేనొక్కడినే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. మహేష్ మూవీ తర్వాత తెలుగులో నాగ చైతన్యకు జంటగా దోచేయ్ మూవీ చేసింది. కాలేజ్ స్టూడెంట్ గా కృతి అదరగొట్టింది. ఈ సినిమా సైతం ఆమెకు హిట్ ఇవ్వలేదు. కృతి గ్లామర్ కు తెలుగు ప్రేక్షకులు పడిపోయినా.. హిట్ దక్కకపోవడంతో ఇక్కడ అవకాశాలు తగ్గాయి. అదే సమయంలో ఆమెకు బాలీవుడ్ లో ఆఫర్స్ మొదలయ్యాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now