KGF : అస‌లు కేజీఎఫ్ క‌థ నిజంగా జ‌రిగిందేనా..? వాస్త‌వ సంఘ‌ట‌న‌ల ఆధారంగా తెర‌కెక్కించారా..?

April 11, 2022 9:54 PM

KGF : క‌న్న‌డ సినిమా కేజీఎఫ్ చాప్ట‌ర్ 1 ఎంత పెద్ద హిట్ అయిందో అంద‌రికీ తెలిసిందే. ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించిన ఈ సినిమా 2018 డిసెంబ‌ర్ 21వ తేదీన విడుద‌లై సంచ‌ల‌నాల‌ను సృష్టించింది. క‌న్న‌డ సినిమా ఇండ‌స్ట్రీలోనే రూ.80 కోట్ల అత్యంత భారీ బ‌డ్జెట్‌తో ఈ మూవీని తెర‌కెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఏకంగా రూ.250 కోట్ల‌ను వ‌సూలు చేసి రికార్డు సృష్టించింది. ఇక కేజీఎఫ్ చాప్ట‌ర్ 2ను ఈ నెల 14వ తేదీన చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేయ‌నున్నారు.

is KGF real story real incidents or what
KGF

అయితే కేఎజీఎఫ్ సినిమాను చూశాక‌.. అది రియ‌ల్ స్టోరీనా ? నిజంగానే అలా జ‌రిగిందా ? అని చాలా మంది సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. అయితే అంద‌రికీ ఈ డౌట్ రావ‌డం స‌హ‌జ‌మే. ఎందుకంటే ఈ సినిమాకు వాడిన టైటిల్.. కేజీఎఫ్.. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌.. క‌ర్ణాట‌క‌లో ఇప్ప‌టికీ ఉన్నాయి. కానీ ఈ గ‌నుల‌ను మూసివేశారు. వాటిలో బంగారాన్ని వెలికి తీసేందుకు చాలా ఖ‌ర్చ‌వుతుంద‌ని.. వ‌చ్చే బంగారం ఖ‌రీదు క‌న్నా.. దాన్ని వెలికి తీసేందుకే ఎక్కువ ఖ‌ర్చు అవుతుంద‌ని.. క‌నుక గ‌నుల‌ను మూసివేస్తున్నామ‌ని ఎప్పుడో చెప్పేశారు. ఆ ఫ‌లితంగా ఆ గ‌నులు మూత‌ప‌డ్డాయి. అయితే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కు షార్ట్ క‌ట్ కేజీఎఫ్ క‌నుక‌.. ఈ సినిమా స్టోరీ కూడా రియ‌ల్ లైఫ్ స్టోరీ అని భావించారు. కానీ ఈ స్టోరీ రియ‌ల్ కాదు.

అయితే కేజీఎఫ్ లాగే అప్ప‌ట్లో బంగారు గ‌నుల్లో ప్ర‌జ‌లు మ‌గ్గిపోయేవారు. క‌నుక ఈ సినిమాను య‌దార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఓ క‌ల్పిత క‌థ‌ను సృష్టించి తీశార‌ని చెప్ప‌వ‌చ్చు. అలాంటి సంఘ‌ట‌న‌లు అప్ప‌ట్లో జ‌రిగాయి. కానీ కేజీఎఫ్ స్టోరీ మాత్రం రియ‌ల్ కాదు. ఇది పూర్తిగా క‌ల్పిత‌మే. ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ఈ విష‌యాన్ని ఎప్పుడో చెప్పేశారు. కానీ ఈ మూవీ స్టోరీని ఇప్ప‌టికీ ఇంకా చాలా మంది రియ‌ల్ అనే అనుకుంటున్నారు. ఇదీ అసలు విష‌యం.

KGF

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now