Roja : జ‌బర్ద‌స్త్‌తోపాటు టీవీ షోలు, సినిమాల‌కు రోజా గుడ్ బై.. క‌న్‌ఫామ్‌..!

April 11, 2022 2:04 PM

Roja : రోజా.. ఈ పేరుకి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఒక‌ప్పుడు హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన రోజా ఇప్పుడు బుల్లితెర‌పై సంద‌డి చేస్తోంది. మ‌రోవైపు రాజ‌కీయాల‌లోను యాక్టివ్‌గా ఉంటోంది. ఇన్నాళ్లూ ఎంఎల్ఏగా ఉన్న రోజాకు మంత్రి ప‌ద‌వి ద‌క్కింది. దీంతో ఆవిడ బుల్లితెర కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటానంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. రోజాకి హోదా మారడంతో జబర్ధస్త్‌, సినిమాల సంగతి ఏంటనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో మంత్రి రోజా క్లారిటీ ఇచ్చారు.. జబర్ధస్త్‌తోపాటు సినిమాలకు కూడా దూరంగా ఉంటానని తెలిపారు. సీఎం జగన్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు.

Roja said good bye to Jabardasth show and movies and other TV shows
Roja

ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పాటు కావటంతో.. తిరుపతి జిల్లా నుంచి తనకు అవకాశం దక్కిందని చెప్పుకొచ్చారు. తాను యాక్టింగ్ చేయాలని చాలా మంది కోరుతున్నా.. ఇప్పుడు మంత్రిగా బాధ్యత పెరిగిందన్నారు. సీఎం జగన్ ఏనాడూ షూటింగ్ లు ఎందుకు చేస్తున్నావని అడగలేదని చెప్పారు. తాను ఏ రోజూ ఇతర నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోలేదని.. ప్రతిపక్షాల పైన మాత్రం రాజకీయంగా విమర్శలు చేస్తానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా తనను అసెంబ్లీలో చూడకూడదని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు అసెంబ్లీలో కనిపించడం లేదన్నారు. తనకు మంత్రిగా అవకాశం ఇవ్వడంతో టీడీపీతోపాటు తోక పార్టీకి ఎక్కడో కాలుతోందని వ్యాఖ్యానించారు.

ఒక‌ప్పుడు జ‌బ‌ర్ధ‌స్త్ అంటే కంటెస్టెంట్స్ అందించే వినోదం పాటు జ‌డ్జిగా ఉన్న నాగ‌బాబు, రోజాల ఎనర్జిటిక్ స్మైల్స్ కూడా మంచి బూస్ట‌ప్ ఇచ్చేవి. కొన్ని కార‌ణాల వ‌ల్ల నాగ‌బాబు షో నుంచి త‌ప్పుకున్నా.. రోజా మాత్రం త‌న‌కు అచ్చి వ‌చ్చిన జ‌బ‌ర్ద‌స్త్ ను వ‌ద‌ల‌లేదు. ఒక ప‌క్క ఎమ్మెల్యేగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తూనే మ‌రోప‌క్క జ‌బ‌ర్ద‌స్త్ షో పై అందంతో ఆక‌ట్టుకుంటూనే ఉంది. ఎంత‌మంది జ‌డ్జిలు వ‌చ్చినా.. వెళ్లినా రోజా లేని జ‌బ‌ర్ద‌స్త్‌ను ఊహించుకోలేం.. అని చెప్ప‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment