రూల్స్ పాటించ‌క‌పోతే అంతే.. పెళ్లికొచ్చినందుకు శిక్ష ప‌డింది.. వీడియో..!

May 21, 2021 4:37 PM

క‌రోనా నేప‌థ్యంలో అనేక రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ను విధించి అమ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే కొన్ని చోట్ల పెళ్లిళ్ల వంటి శుభ కార్యాల‌కు ప‌రిమిత సంఖ్య‌లో అతిథుల‌తో అనుమ‌తులు ఇస్తున్నారు కానీ కొన్ని చోట్ల ఆ కార్యాల‌పై పూర్తిగా నిషేధం విధించారు. అయితే శుభ కార్యాల‌కు అనుమ‌తులు ఉన్న చోట్ల‌లో అనుమ‌తి ఇచ్చిన సంఖ్య‌లో కాకుండా కొన్ని చోట్ల భారీ సంఖ్య‌లో అతిథులు హాజ‌ర‌వుతున్నారు. దీంతో పోలీసులు త‌మ లాఠీల‌కు ప‌నిచెప్పాల్సి వ‌స్తోంది. అయితే అక్క‌డ మాత్రం పోలీసులు అతిథుల‌కు వింతైన శిక్ష విధించారు.

pelli kappa ganhtulu viral video

మ‌ధ్యప్ర‌దేశ్‌లోని భింద్ జిల్లా ఉమ‌రై గ్రామంలో తాజాగా ఓ పెళ్లి జ‌రిగింది. అయితే ఆ వేడుక‌కు ఏకంగా 300 మందికి పైగా అతిథులు వ‌చ్చారు. కోవిడ్ నిబంధ‌న‌ల‌ను పూర్తిగా ఉల్లంఘించారు. దీంతో స‌మాచారం అందుకున్న స్థానిక పోలీసులు అక్క‌డికి చేరుకున్నారు. అయితే అప్ప‌టికే చాలా మంది అక్క‌డి నుంచి పారిపోయారు. కానీ కొంద‌రు మాత్రం పోలీసుల‌కు చిక్కారు.

త‌మ చేతికి చిక్కిన కొంత మందిచే పోలీసులు కప్ప గంతులు వేయించారు. ఎవ‌రైనా ఆ గంతులు వేయ‌క‌పోతే వారిని పోలీసులు లాఠీల‌తో బెదిరించారు. దీంతో వారు గంతులు వేయ‌క‌త‌ప్ప‌లేదు. కోవిడ్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసులు హెచ్చ‌రించారు. కాగా ఆ స‌మ‌యంలో తీసిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now