Pragya Jaiswal : డ‌బ్బుల కోసం ఇంత‌కు దిగ‌జారుతావా.. ప్ర‌గ్యా జైస్వాల్‌పై నెటిజ‌న్ల ఫైర్‌..!

April 10, 2022 4:45 PM

Pragya Jaiswal : కంచె చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌ని గెలుచుకున్న అందాల ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్. చూడ చ‌క్క‌ని, ఆకర్షించే అభిన‌యం ఉన్నా కూడా ఈ అమ్మ‌డికి స‌రైన ఆఫ‌ర్స్ రావడం లేదు. ఇటీవ‌ల ప్రగ్యా జైశ్వాల్.. బాలయ్య అఖండలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా మంచి హిట్ కాగా ప్ర‌గ్యాకి కూడా మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమా త‌ర్వాత అయినా ప్ర‌గ్యాకు వ‌రుస ఆఫ‌ర్స్ వ‌స్తాయ‌ని అంద‌రూ భావించారు. కానీ ఈ అమ్మ‌డికి ఆఫ‌ర్స్ క‌రువ‌య్యాయి. వ‌చ్చిన ఏ అవ‌కాశాన్ని కూడా వ‌దులు కోవ‌డానికి సిద్ధ‌ప‌డ‌డం లేదు.

netizen angry on Pragya Jaiswal for promoting liquor brand
Pragya Jaiswal

ప్ర‌గ్యా జైస్వాల్ తాజాగా ఓ ఫోటోను తన సోషల్ మీడియాలో పంచుకుంది. విస్కీ.. దాంతోపాటు ఓ గ్లాస్‌ను చేతబట్టుకుని ఫోటోలకు పోజులిచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రగ్యా జైశ్వాల్ ఓ వీస్కీ కంపెనీని ప్రమోట్ చేస్తోంది. అందుకే ఆ బ్రాండ్‌కు చెందిన వీస్కీ‌ని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలా ఓ వైపు సినిమాలతోపాటు ఇలా పెయిడ్ యాడ్స్‌తో రెండు చేతులా ఆర్జిస్తోంది. అయితే జిమ్ బీమ్ అనే విస్కీ బ్రాండ్ ని ప్రమోట్ చేస్తూ అమ్మడు ఓ హాట్ ఫోజ్ లో కనిపించింది.

 

View this post on Instagram

 

A post shared by Pragya Jaiswal (@jaiswalpragya)

విస్కీ బాటిల్ ని హైలైట్ చేసిన‌ ప్రగ్యా.. బ్లాక్ అండ్ వైట్ లో కనిపించింది. ఇక ఇది చూసిన నెటిజన్స్ మత్తు ఎక్కించే రెండూ పక్క పక్కన ఉంటే ఒకటే హైలైట్ అవుతుంద‌ని చెప్పలేం.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మ‌రి కొంద‌రు డ‌బ్బుల కోసం ఇంతగా దిగజారుతావా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ప్రస్తుతం ప్రగ్యా ఒక టాప్ హీరో సరసన ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now