Akira Nandan : ప‌వ‌న్ త‌న‌యుడు సినిమాల్లోకి..? రేణు దేశాయ్ కామెంట్స్‌..!

April 10, 2022 3:16 PM

Akira Nandan : మెగా ఫ్యామిలీ నుండి హీరోలు క్యూ క‌డుతూనే ఉన్నారు. ఇప్ప‌టికే క్రికెట్ జ‌ట్టు కూడా త‌యారైంది. ఇక ప‌వ‌న్ త‌న‌యుడు అకీరా ఎంట్రీ త్వ‌ర‌లోనే ఉంటుంద‌ని కొన్నాళ్లుగా వార్త‌లు వినిపిస్తూ వ‌స్తున్నాయి. ఎన్నోసార్లు అకీరా ఎంట్రీ గురించి రూమర్లు కూడా వచ్చాయి. అయితే రేణూ దేశాయ్ మాత్రం తన కుమారుడు సినిమాల్లోకి రావాలనుకుంటే తాను ఏమాత్రం అడ్డు చెప్పనని చెబుతూనే రూమర్లకు కూడా పలుమార్లు ఫుల్ స్టాప్ పెట్టింది. అకీరా బ‌ర్త్ డే సంద‌ర్భంగా మ‌ళ్లీ అకీరా వెండితెర ఎంట్రీపై వార్త‌లు వ‌స్తున్నాయి.

Akira Nandan into movies what Renu Desai said
Akira Nandan

అకీరాకు 18 ఏళ్లు వచ్చాయ్.. అకీరా నాకు కేవలం ఒక మంచి కొడుకు మాత్రమే కాదు.. ఆద్యకు ఓ మంచి అన్న.. తన స్నేహితులకు గొప్ప ఫ్రెండ్, ఎంతో దయాగుణం ఉన్నవాడు.. నిజాయితీ పరుడు.. ఓ జెంటిల్మ‌న్. ఈ రోజు అకీరా యవ్వనంలోకి ఎంట్రీ ఇచ్చాడు. అకీరాకు విషెస్ అందిస్తున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ అని బాక్సింగ్ వీడియోను షేర్ చేసింది రేణు దేశాయ్‌. దీంతో అకీరా సినీ ఎంట్రీపై ఊహాగానాలు వచ్చేశాయ్. దీనిపై రేణూ దేశాయ్ స్పందించింది. అతడికి నటనపైన ఆసక్తి లేదు.. ఏ సినిమాలోనూ పాటలు కూడా పాడటం లేదు.. అతని ఎంట్రీ గురించి వచ్చే వార్తలను నమ్మకండి అని రేణూ దేశాయ్ చెప్పుకొచ్చింది.

ఇక అకీరా త‌న తండ్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ద‌గ్గ‌రే ఎక్కువ‌గా ఉంటున్నాడు. అన్నింట్లో శిక్ష‌ణ తీసుకుంటున్నాడు. చూస్తుంటే రానున్న రోజుల‌లో వెండితెర ఎంట్రీ ఇవ్వ‌డం ఖాయంగా కనిపిస్తోంది. పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రం హరి హర వీర మల్లు. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ మోడ్‌లో ఉంది. పవన్ ఇటీవల సెట్స్‌లో జాయిన్ అయ్యాడు. ఈ పీరియాడిక్ డ్రామాకు దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా, ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరాకు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా న‌టిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now