Urfi Javed : ఉర్ఫి జావేద్‌.. ఆత్మ‌హ‌త్య చేసుకునేంత‌ క‌ష్టం ఏమోచ్చింది..?

April 8, 2022 2:05 PM

Urfi Javed : బోల్డ్ బ్యూటీ ఉర్ఫి జావేద్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. హిందీ బిగ్‌బాస్ ఓటీటీ కంటెస్టెంట్‌గా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నఈ భామ రోజూ ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. రీసెంట్‌గా ఈ ముద్దుగుమ్మ కేజీఎఫ్ తొలి పార్ట్ మూవీని చూడలేదని.. అందుకు బాధపడుతున్నట్లు చెప్పింది. అంతేకాదు.. రామ్ చరణ్ చాలా హ్యాండ్‌సమ్ అంటూ కితాబు కూడా ఇచ్చింది. అంతేకాదు త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి కూడా కొన్ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.

Urfi Javed said that she thought to commit suicide at that time
Urfi Javed

వెరైటీ డ్రెస్సులతో సోషల్‌ మీడియా సెన్సేషన్‌గా మారిన ఉర్ఫి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మానసిక ఒత్తిడి గురించి మాట్లాడింది. తనను నటిగా కాదు కదా, కనీసం ఫ్యాషన్‌ డిజైనర్‌గా చూసేందుకు కూడా ఇంటిసభ్యులు ఇష్టపడలేదని చెప్పుకొచ్చింది. తనకున్న ప్యాషన్‌ను వదిలేయలేక ఇంటిని వదిలేసి వచ్చానంది. అలా బుల్లితెర ధారావాహికల్లో చిన్నచిన్న పాత్రలు పోషించానంది. కొన్ని సంవ‌త్స‌రాలు మానసిక వేదనను అనుభవించానంది. ఎప్పటికీ ఇలాగే బతకాలా ? లేదంటే ఏదో ఒకరోజు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోదామా ? అనిపించిందని చెప్తూ బాధపడింది.

జీవితంలో ఏవైనా అద్భుతాలు జరగాలని కోరుకున్నాను, కానీ పరిస్థితుల వల్ల చిన్న చిన్నపాత్రలు చేయాల్సి వస్తోందని విచారం వ్యక్తం చేసింది ఉర్ఫి. ఈమె త‌న సోష‌ల్ మీడియాలో ఇంత‌కు ముందు ప్ర‌స్తావించిన‌ట్లు అంద‌రికీ షాకిచ్చేలా దుస్తుల‌ను ధ‌రిస్తుంటుంది. అదే క్ర‌మంలో హోలీ సంద‌ర్భంగా ఈమె ఓ చుడీదార్‌ను వేసుకుంది. కానీ చుడీదార్‌ను కూడా త‌న అందాల‌ను బ‌య‌ట‌కు క‌నిపించేలా డిజైన్ చేయించుకుంది. చుడీదార్‌లోనూ అందాల‌ను బ‌య‌ట‌కు క‌నిపించేలా డిజైన్ చేయించుకున్న ఈ బిగ్ బాస్ బ్యూటీని చూసి నెటిజ‌న్స్ ఒక్క‌సారిగా ఫైర్ అయ్యారు. ఎవ‌రు ఎలా అనుకున్నా తాను మాత్రం త‌గ్గ‌నంటోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment