OTT : ఈ వారం ఓటీటీలలో రిలీజ్ కాబోతున్న‌ సినిమాల లిస్ట్.. పెద్ద‌దే.. ప్రేక్ష‌కుల‌కు పండ‌గే..!

April 4, 2022 8:32 PM

OTT : క‌రోనా విజృంభించిన‌ప్ప‌టి నుండి ఓటీటీల‌కి డిమాండ్ ఏర్ప‌డింది. సినిమాలు థియేట‌ర్స్‌లో రిలీజ్ అయినా కూడా కొద్ది రోజుల‌కే ఓటీటీల‌లో వ‌స్తున్నాయి. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్ స్టార్ లాంటి ప్రముఖ ఓటీటీల్లో ఈ వారం స్ట్రీమింగ్ కానున్న‌ సినిమాల లిస్ట్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

list of movies releasing this week on OTT platforms full entertainment
OTT

ఈటీ.. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ ఈటీ. ఎవరికీ తలవంచడు. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక అరుళ్ మోహన్ నటించగా, పాండిరాజ్ డైరెక్షన్ లో ఈ సినిమా తమిళం, తెలుగు భాషల్లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా రీసెంట్ గా థియేటర్లలో రిలీజ్ అయ్యి మంచి టాక్ ను దక్కించుకుంది. ఈ మూవీ ఏప్రిల్ 7 న సన్ నెక్ట్స్, నెట్ ఫ్లెక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నారు.

స్టాండప్ రాహుల్.. థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ప్రేక్షకుల్ని సందడి చేసిన స్టాండప్ రాహుల్ సినిమా అతి త్వరలోనే ఓటీటీలోకి రానుంది. రాజ్ తరుణ్ నటించిన ఈ సినిమా ఆశించినంత స్థాయిలో హిట్ ను దక్కించుకోలేకపోయింది. ఈ క్రమంలో సినిమా రిలీజ్ అయిన మూడు వారాలకే ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఆహా ఓటీటీలో ఏప్రిల్ 8న స్టాండప్ రాహుల్ స్ట్రీమింగ్ కానుంది.

తానక్కరన్.. కోలీవుడ్ హీరో విక్రమ్ ప్రభు నటించిన సినిమా తానక్కరన్. ఈ మూవీని తెలుగులో పోలీసోడుగా డబ్బింగ్ చేశారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఏప్రిల్ 8 నుండి డిస్నీ హాట్‌ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. పోలీస్ అధికారుల ట్రైనింగ్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.

నరధాన్.. టోవినో థామస్ నటించిన మలయాళ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఈ సినిమాలో టోవినో థామస్ జర్నలిస్ట్ పాత్రను పోషించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 8వ తేదీన స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది.

ది కింగ్స్‌మన్.. ది కింగ్స్ మన్ ఫ్రాంచైజీ నుండి వచ్చిన మూడవ సినిమా ఇది. ది కింగ్స్ మ్యాన్ అనే పేరుతో ఉన్న కామిక్ పుస్తకం నుండి ఈ సినిమాను తెరకెక్కించారు. ఏప్రిల్ 8న ఈ సినిమా డిస్నీ ప్ల‌స్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now