Viral Video : వామ్మో.. భారీ తాచు పామును ఎదురుగా పెట్టుకుని స్నానం చేయించాడు.. వీడియో..!

March 31, 2022 6:56 PM

Viral Video : పాముల‌ను చూస్తేనే కొంద‌రు ఆమడ దూరం పారిపోతారు. కొంద‌రికి పాము పేరు చెబితేనే వెన్నులో వ‌ణుకు పుడుతుంది. ఇక పాము ఎదురుగా వ‌స్తేనా.. అంతే సంగ‌తులు. బ‌తుకు జీవుడా.. అంటూ ఎవ‌రైనా పారిపోతారు. అయితే ఆ వ్య‌క్తికి మాత్రం పాము అంటే ఏమాత్రం భ‌యం లేదు. పైగా భారీ తాచుపాముకు అత‌ను స్నానం చేయించాడు. దాని త‌ల‌పై రెండు బ‌కెట్ల నీళ్లు కూడా పోశాడు. ఈ క్ర‌మంలోనే ఈ వీడియో వైర‌ల్‌గా మారింది.

Viral Video man bathed cobra without any fear
Viral Video

సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఓ వీడియోలో ఓ వ్య‌క్తి పాము త‌ల‌పై రెండు బ‌కెట్ల నీళ్ల‌ను కుమ్మ‌రించి స్నానం చేయించిన‌ట్లు చేశాడు. అది తాచు పామ‌ని చూస్తుంటేనే అర్థ‌మ‌వుతుంది. భారీగా పొడ‌వుగా కూడా ఉంది. అంత‌టి పెద్ద పామును చూస్తే ఎవ‌రికైనా ఒళ్లు జ‌ల‌ద‌రిస్తుంది. దూరంగా పారిపోతారు. కానీ ఆ వ్య‌క్తి మాత్రం ఏమాత్రం భ‌య‌ప‌డ‌కుండా పాము త‌ల‌పై నీళ్లు పోశాడు. అయితే ఈ వీడియో చాలా పాత‌ది. అయిన‌ప్ప‌టికీ మ‌ళ్లీ వైర‌ల్ అవుతోంది.

ఈ వీడియోను షేర్ చేసింది 2020వ సంవత్సరం మే నెల‌లో. అప్ప‌ట్లో ఆ స‌మ‌యంలో ఎండ‌లు ఎక్కువ‌గానే ఉన్నాయి. మే నెల‌లో స‌హ‌జంగానే ఎండ‌లు ఎక్కువ‌గా ఉంటాయి. అయితే ఆ వేడికి తాళ‌లేక ఆ పాము అక్క‌డికి వ‌చ్చిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. అందుక‌నే దాని వేస‌వి తాపాన్ని త‌గ్గించేందుకు అత‌ను అలా చేశాడ‌ని తెలుస్తోంది. అయితే ఈ వీడియో పాత‌ది అయినా ఇప్పుడు నెటిజ‌న్లు దీన్ని తెగ వీక్షిస్తూ షేర్ చేస్తున్నారు. ఇది సోష‌ల్ మీడియాలో ఇప్పుడు మ‌ళ్లీ వైర‌ల్ అవుతోంది. ఇక ఈ వీడియో గురించి నెటిజ‌న్లు ర‌క‌ర‌కాల కామెంట్లు కూడా చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now