Samantha : ఒక్క ఇన్‌స్టాగ్రామ్ పోస్టుకు స‌మంత ఎంత సంపాదిస్తుందో తెలుసా ?

March 28, 2022 8:12 AM

Samantha : నాగ‌చైత‌న్య‌తో విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించిన త‌రువాత స‌మంత చాలా బిజీగా మారింది. గ‌తంలో ఎన్న‌డూ లేనంత బిజీగా ఆమె ఇప్పుడు ఉంది. వ‌రుస ప్రాజెక్టుల్లో న‌టిస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది. ఐట‌మ్ సాంగ్‌లు, సినిమా చాన్స్‌లతోపాటు ప‌లు బ్రాండ్‌ల‌కు ఈమె ప్ర‌చార‌క‌ర్త‌గా ఉంది. సొంతంగా బిజినెస్‌లు కూడా చేస్తోంది. ఇక సోష‌ల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉండే స‌మంత ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కూడా కోట్ల రూపాయ‌ల‌ను సంపాదిస్తోంది.

do you know how much Samantha takes for one Instagram post
Samantha

స‌మంత ఈ మ‌ధ్య కాలంలో ఇన్‌స్టాగ్రామ్‌లో త‌ర‌చూ యాడ్స్ పోస్ట్ చేస్తోంది. అయితే ఒక్క యాడ్ ను పోస్ట్ చేసినందుకు ఆమె ఏకంగా రూ.15 ల‌క్ష‌ల నుంచి రూ.20 ల‌క్ష‌లు తీసుకుంటుంద‌ని తెలుస్తోంది. అది కేవ‌లం యాడ్‌ల‌ను పోస్ట్ చేసిందుకే. వాటిల్లో న‌టిస్తే ఆమెకు ఇంకా ఎక్కువే ఇవ్వాల్సి వ‌స్తోంది. అలా ఆమె ఒక యాడ్‌కు రూ.1 కోటి వ‌ర‌కు తీసుకుంటుంద‌ని స‌మాచారం. అయితే ఈ మొత్తం ఏడాది కాలానికి వ‌ర్తిస్తుంది. ఆ స‌మ‌యంలో ఆమెతో కంపెనీలు నిర్దిష్ట‌మైన సంఖ్య‌లో యాడ్స్ తీసుకోవ‌చ్చు. ఇలా తాను ప్ర‌చారం చేసే బ్రాండ్ల‌కు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా భిన్న ర‌కాలుగా రెమ్యున‌రేష‌న్‌ను తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.

ఇక ప్ర‌స్తుతం స‌మంత య‌శోద సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంది. నార్త్ ఇండియాలో ఆమె ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటోంది. అలాగే ఈమె త‌మిళంలో న‌టించిన కాతువాకుల రెండు కాద‌ల్ వ‌చ్చే నెల‌లో రిలీజ్ కానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now