RRR Movie : ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ఓటీటీలో విడుదల‌య్యేది అప్పుడే..!

March 26, 2022 8:35 PM

RRR Movie : దర్శక ధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. ఇద్దరు స్వాతంత్య్ర‌ సమరయోధుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం విడుదలైంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీమియర్ షో తోనే అద్భుతమైన ఆదరణ దక్కించుకొని బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది.

RRR Movie to stream on OTT apps on that date
RRR Movie

సాధారణంగా థియేటర్లలో విడుదలైన ప్రతి సినిమా కూడా ఓటీటీలో విడుదల కావడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే అభిమానులు ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు విడుదల అవుతుందా.. అని ఆరా తీస్తున్నారు. సాధారణంగా థియేటర్లలో విడుదలైన తర్వాత 45 రోజులకు ప్రతి ఒక్క సినిమా కూడా ఓటీటీలో విడుదల అవుతుంది.

అయితే ఈ సినిమా కూడా అన్ని సినిమాల మాదిరిగా నెల రోజుల వ్యవధి తర్వాత విడుదల అవుతుందని భావించిన వారికి చిత్రబృందం షాకింగ్ న్యూస్ తెలియజేసింది. ఈ సినిమా థియేటర్లలో విడుదలైన 90 రోజులకు ఓటీటీలో విడుదలవుతుందని తెలియజేశారు. దీని ప్రకారం చూస్తే ఈ సినిమా జూలై నెలలో ఓటీటీలో విడుదల కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వెర్షన్‌ను జీ5 భారీ డీల్‌కు సొంతం చేసుకోగా.. హిందీ వెర్షన్‌ను మాత్రం నెట్‌ఫ్లిక్స్‌ కొనుగొలు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్ల‌లో ప్రేక్షకులను సందడి చేస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now