ఆంధ్రా స్పెషల్: పచ్చి మామిడికాయ పప్పు తయారీ విధానం..

May 19, 2021 12:33 PM

వేసవి కాలం వచ్చిందంటే చాలు మనకు మార్కెట్లో మామిడి పండ్లు కనిపిస్తాయి. బాగా పండిన మామిడి పండ్లను తినడానికి ఎంతో మంది ఇష్టపడతారు. కానీ పచ్చి మామిడి కాయతో పప్పు చేసి వేడివేడి అన్నంలోకి తింటే ఆ రుచి వర్ణణాతీతం. మామిడికాయ పప్పును చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎంతో ఇష్టంగా తింటారు. మరి అంత రుచికరమైన మామిడికాయ పప్పు తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం…

కావలసిన పదార్థాలు

*పచ్చిమామిడికాయ ఒకటి

*కందిపప్పు ఒక కప్పు

*టమోటాలు మూడు

*పచ్చిమిర్చి15

*ఉప్పు తగినంత

*పసుపు చిటికెడు

*కొత్తిమిర

*తగినంత నీరు

పోపుకు కావలసిన పదార్థాలు

*1/2టేబుల్ స్పూన్ ఆవాలు

*1/2 జీలకర్ర

*1/2 ధనియాలు

*ఉల్లిపాయ ముక్కలు

*వెల్లుల్లి రెబ్బలు

*పచ్చి కరివేపాకు

*ఎండు మిర్చి 2

* నూనె 3 టేబుల్ స్పూన్లు

తయారీ విధానం

ముందుగా పచ్చి మామిడికాయ తొక్క మొత్తం తీసి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. కంది పప్పు, పర్చిమిర్చి,టమాటాలు,మామిడి ముక్కలు, కొత్తిమీర పసుపు,తగినంత నీరు కుక్కర్ లో వేసి మూడు విజిల్స్‌ వచ్చే వరకు పెట్టాలి. మూడు విజిల్స్‌ వచ్చిన తర్వాత ప్రెషర్ వెళ్లిన తరువాత రుచికి సరిపడా ఉప్పు వేసి పప్పును బాగా రామాలి.

స్టౌవ్ పై మరో కడాయిను ఉంచి కొద్దిగా నూనె వేయాలి.నూనె వేడి అయిన తరువాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు,ధనియాలు, ఉల్లిపాయ ముక్కలు, వెళ్లులి వేసి బాగా మగ్గనివ్వాలి.ఆవాలు చిటపట అనగానే పోపును ముందుగా రామి పెట్టుకున్న పప్పులో వేయాలి. దీంతో ఎంతో రుచికరమైన పచ్చి మామిడి కాయ పప్పు రెడీ.ఈ పప్పును వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసి తింటే ప్లేట్ కాళీ కావాల్సిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now