Amazon : నిరుద్యోగుల‌కు అమెజాన్ బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఉచితంగా 500 కోర్సుల్లో శిక్ష‌ణ‌..!

March 25, 2022 8:56 PM

Amazon : ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ విద్యార్థులకు అద్భుతమైన బంపర్ ఆఫర్ కల్పించింది. ఏకంగా 500 కోర్సులలో ఉచితంగా శిక్షణ ఇవ్వడానికి అమెజాన్ ముందుకు వచ్చింది. ఆ సంస్థకు చెందిన అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ (ఏడబ్ల్యూఎస్‌) క్లౌడ్‌ కంప్యూటింగ్‌ నైపుణ్యాల్లో ఉచితంగా శిక్షణనివ్వడంపై అమెజాన్ పెద్ద ఎత్తున పెట్టుబడి పెడుతున్నట్లు తెలియజేసింది.

Amazon bumper offer for unemployed free coaching in 500 courses
Amazon

ఈ క్రమంలోనే అమెజాన్ అంతర్జాతీయంగా 2.9 కోట్ల మంది విద్యార్థులకు 500 పైగా డిజిటల్ ట్రైనింగ్ కోర్సులను ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించింది. దీనికోసం అమెజాన్ వెబ్ సర్వీస్ ఉన్నత విద్యా సంస్థలు, లాభాపేక్ష లేని సంస్థలు, ప్రభుత్వాలు, కంపెనీలు మొదలైన వాటితో పని చేయనుంది. అలాగే భారతదేశంలో ఏడబ్ల్యూఎస్‌ రీ/స్టార్ట్‌ పేరిట 12 వారాల పాటు ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగా కోర్సును అందించనున్నారు.

విద్యార్ధులకు ఈ కోర్సులు క్లౌడ్‌ కంప్యూటింగ్‌లో కెరియర్‌కు ఉపయోగపడుతాయి. 2017 వ సంవత్సరం నుంచి దేశీయంగా దాదాపు 10 లక్షల మందికి శిక్షణనిచ్చినట్లు ఏడబ్ల్యూఎస్‌ వెల్లడించింది. విద్యార్థులు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇంత మంచి అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అమెజాన్ సూచించింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now