Naga Babu : నిహారిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను తానే డిలీట్ చేశాన‌న్న నాగ‌బాబు..!

March 22, 2022 5:28 PM

Naga Babu : మెగా బ్రదర్ నాగబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన నటుడిగా, నిర్మాతగా పేరు సంపాదించుకొని ప్రస్తుతం బుల్లితెర పై పలు కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే నాగబాబు పలు అంశాలపై స్పందిస్తూ తన దైన శైలిలో కామెంట్లు చేస్తుంటారు. ఈ క్రమంలోనే నాగబాబు చేసే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.

Naga Babu said he deleted Niharika Instagram account
Naga Babu

సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే నాగబాబు సరదాగా అభిమానులతో చిట్ చాట్ చేశారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ నుంచి నాగబాబుకు నిహారిక వైవాహిక జీవితం గురించి ప్రశ్న ఎదురైంది. నాగబాబు అంకుల్ నిహారిక అక్క ఒక్కసారిగా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేశారు. ఏమైంది తన గురించి వచ్చే రూమర్లపై స్పందించండి అంటూ ప్రశ్నించారు. ఈ విధంగా నెటిజన్ అడిగిన ప్రశ్నకు నాగబాబు స్పందిస్తూ తనదైన శైలిలో సమాధానం చెప్పారు.

ఈ సందర్భంగా నాగబాబు సమాధానం చెబుతూ తన గురించి ఇలాంటి రూమర్స్ రావడానికి కారణం తానే అని వెల్లడించారు. తానే కోడింగ్ నేర్చుకొని నిహారిక అకౌంట్ హ్యాక్ చేశాన‌ని, డీ కోడ్‌ నేర్చుకోగానే రీ యాక్టివేట్ చేస్తాను అంటూ బ్రహ్మానందం ఎమోజీలతో రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం నాగబాబు ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా నిహారిక వైవాహిక జీవితం గురించి మనస్పర్థలు రావడంతో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలకు చైతన్య చెక్ పెడుతూ వారిద్దరూ ఎంతో చనువుగా ఉన్న ఫోటోలను షేర్ చేశారు. ఈ క్ర‌మంలోనే నాగబాబు ఇలా కామెంట్స్ చేయ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now