Vijay Devarakonda : పార్టీ మూడ్ లో చిల్ అవుతున్న రౌడీ హీరో.. జాన్వీతో సెల్ఫీ..!

March 19, 2022 7:00 PM

Vijay Devarakonda : పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న లైగర్ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. ఈ సినిమా పూర్తి కావడంతో విజయ్ దేవరకొండ పార్టీ మూడ్ లో చిల్ అవుతున్నాడు. ఈ క్రమంలోనే ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ సీఈవో అపూర్వ‌మెహ‌తా బ‌ర్త్ డే పార్టీ కోసం బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. ఈ క్రమంలోనే లైగర్ చిత్రబృందం కూడా హాజరైంది.

Vijay Devarakonda  selfie with Janhvi Kapoor
Vijay Devarakonda

ఈ బర్త్‌ డే పార్టీ కి బ్లాక్ అవుట్ ఫిట్ ధరించిన విజయ్ దేవరకొండ, ఛార్మి, పూరి జగన్నాథ్, అనన్య పాండేతో కలిసి పూర్తిగా పార్టీని ఎంజాయ్ చేశారు. ఈ విధంగా అందరితో కలిసి ఎంతో సరదాగా గడిపిన విజయ్ దేవరకొండ అనంతరం అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తో కలిసి సెల్ఫీ దిగాడు.

గోల్డెన్ క‌ల‌ర్ స్లీవ్‌లెస్ టాప్‌లో ఉన్న జాన్వీక‌పూర్‌తో బ్లాక్ షూట్‌లో ఉన్న విజ‌య్ స్మైల్ ఇస్తూ దిగిన స్టిల్ ఇపుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటోలలో విజయ్ దేవరకొండ, జాన్వీ కపూర్ తోపాటు డిజైన‌ర్ మ‌నీష్ మల్హోత్రా, ఛార్మీ కౌర్ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక విజయ్ దేవరకొండ నటించిన లైగర్‌ సినిమా ఆగస్టు నెలలో విడుదల కానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now