Manchu Lakshmi : హోలీ ఆడిన మంచు ల‌క్ష్మి.. చాలా రోజుల త‌రువాత మంచు మ‌నోజ్ ద‌ర్శ‌నం..

March 19, 2022 12:35 PM

Manchu Lakshmi : టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకవైపు సినిమా ఇండస్ట్రీలోనూ, మరోవైపు విద్యారంగంలోనూ మంచు కుటుంబం పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. ఇక హోలీ పండుగ సందర్భంగా మంచు కుటుంబం మొత్తం ఒక చోట చేరి పెద్ద ఎత్తున పండుగ సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే హోలీ వేడుకలకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.

Manchu Lakshmi Holi festival at her home
Manchu Lakshmi

ఇక ఈ వీడియో సందర్భంగా చాలా కాలం తర్వాత అభిమానులు మంచు మనోజ్ ను చూశారు. అయితే గత కొంత కాలం నుంచి మంచు కుటుంబం గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ విధంగా మంచు కుటుంబం గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నప్పటికీ మంచు మనోజ్ ఏమాత్రం ఈ వార్తలపై స్పందించలేదు. మంచు మనోజ్ కొంత కాలం నుంచి సోషల్ మీడియాకి కూడా దూరంగా ఉంటున్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Lakshmi Manchu (@lakshmimanchu)

ఇక తాజాగా హోలీ పండుగ సందర్భంగా మంచు మనోజ్ తన కుటుంబ సభ్యులతో కలిసి హోలీ జరుపుకున్నట్టు అర్థమవుతోంది. ఈ క్రమంలోనే మంచు లక్ష్మి, విష్ణు, మనోజ్ అందరూ కలిసి ఈ వేడుకలను జరుపుకున్నట్లు వీడియోలో చూడవచ్చు. కాగా మంచు లక్ష్మి షేర్ చేసిన ఈ వీడియో ద్వారా మంచు మనోజ్ చాలా రోజుల తర్వాత కనిపించడంతో అభిమానులు మంచు మనోజ్ ని చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈయన సినిమాలకు సంబంధించి ఏ విధమైనటువంటి అప్‌డేట్‌ తెలియజేయడం లేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now