Kalyan Dhev : హోలీ వేడుకలు కూడా విడి విడిగానే..? కల్యాణ్‌ దేవ్‌, శ్రీజ మళ్లీ వార్తల్లోకి..!

March 18, 2022 5:01 PM

Kalyan Dhev : మెగా డాటర్ శ్రీజ, కళ్యాణ్ దేవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శ్రీజ మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత కళ్యాణ్ దేవ్ ను రెండో వివాహం చేసుకుంది. ఇలా కొంతకాలం పాటు ఎంతో సంతోషంగా ఉన్న ఈ జంట విడాకులు తీసుకోబోతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కళ్యాణ్ దేవ్ గత కొద్ది రోజుల నుంచి మెగా కుటుంబంలో జరిగే వేడుకలకు కూడా దూరంగా ఉంటున్నాడు.

Kalyan Dhev  and Sreeja Holi festival celebrations separately
Kalyan Dhev

అలాగే కళ్యాణ్ దేవ్ నటించిన సినిమాలకు కూడా మెగా కుటుంబం మద్దతు తెలుపకపోవటంతో వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని, విడాకులు తీసుకుంటున్నారని పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇకపోతే తాజాగా హోలీ పండుగ సందర్భంగా మెగా కుటుంబంలో పెద్ద ఎత్తున హోలీ సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ హోలీ పండుగకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను శ్రీజ కూతురు నివృత్తి షేర్ చేయడంతో కళ్యాణ్ దేవ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెట్టుకున్నాడు.

ఈ ఫోటోలను తన ఇన్‌స్టా స్టోరీలో పెట్టుకోవడమే కాకుండా రంగుల్లో మునిగిపోయారు.. అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం కళ్యాణ్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ ఫోటోలలో ఎక్కడ కూడా శ్రీజ కనిపించలేదు. మరి వీరందరూ కలిసి ఒకేచోట హోలీ సంబరాలు చేసుకున్నారా.. లేక వేరే చోట సంబరాలు చేసుకున్నారా.. అనే విషయం తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now