Naga Babu : నాగబాబుపై నెటిజన్ల ఆగ్రహం.. కారణం అదే..!

March 16, 2022 7:45 PM

Naga Babu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై మెగా బ్రదర్ నాగబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డికి జోహార్లు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గురించి నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యల పట్ల వైసీపీ అభిమానులు, కార్యకర్తలు నాగబాబుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

netizen angry on Naga Babu  for comments on CM YS Jagan
Naga Babu

అసలు నాగబాబు ముఖ్యమంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే.. జంగారెడ్డిగూడెంలో గత రెండు రోజుల క్రితం ఏకంగా 18 మంది కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలతో మృతి చెందిన సంగతి మనకు తెలిసిందే. అయితే ప్రతిపక్షం ఈ మరణాలు కల్తీ సారాయి వల్ల జరిగాయని ప్రభుత్వంపై విమర్శలు చేసింది. కానీ ఇవి సహజ మరణాలేనని ప్రభుత్వం వెల్లడించింది.

ఈ క్రమంలోనే ఈ మరణాల పట్ల మెగా బ్రదర్ నాగబాబు స్పందిస్తూ.. జంగారెడ్డి గూడెంలో జరిగిన దుర్ఘటన తెలుసుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు ఎంతో ఊరట కలిగించాయి. మొదట్లో మీడియా, డాక్టర్ల వల్ల.. ఈ మరణాలు అన్నీ కల్తీసారా వల్ల జరిగాయని పొరపాటు పడ్డాను. కానీ మన ముఖ్యమంత్రి తన ప్రత్యేక డిక్షనరీ ద్వారా ఇవి సహజ మరణాలని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నాను. ఇలా చనిపోయిన వారందరూ ఒకే లక్షణాలు కలిగి ఉండి ఒకే ప్రాంతానికి చెందిన వారైనప్పటికీ ఈ మరణాలు కల్తీసారా వల్ల కలగలేదని సహజ మరణాలు అని తేల్చి చెప్పిన మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జోహార్లు.. అంటూ నాగబాబు చెప్పుకొచ్చారు.

నాగబాబు జగన్మోహన్ రెడ్డి పై చేసిన ఈ వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా చనిపోయినవారికి జోహార్లు చెబుతాము.. అలాంటిది నాగబాబు చేసిన పోస్ట్ పై వైసీపీ అభిమానులు స్పందిస్తూ.. విమర్శలు చేసినా హుందాగా ఉండాలి కానీ ఇలా స్థాయి దిగజార్చుకొనేలా ఉండకూడదు.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే కోర్టుకు వెళ్లి తేల్చుకోవాలి కానీ ఇలా చివరిలో మీరు రాసిన అవివేకానికి జోహార్లు.. అనే వాక్యం సరికాదని.. జగన్ అభిమానులు నాగబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కౌంటర్లు వేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now