RRR Movie : వామ్మో.. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎంత ఖర్చు చేశారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

March 15, 2022 4:38 PM

RRR Movie : రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా మరో పది రోజులలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడడంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాని ఇదే స్థాయిలో భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కించిన విషయం అందరికీ తెలిసిందే.

RRR Movie do you know how much money spent for this film
RRR Movie

ఇక ఈ సినిమా కోసం ప్రముఖ నిర్మాత డి.వి.వి.దానయ్య ఏకంగా రూ.450 కోట్లు ఖర్చు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమా పూర్తి స్థాయిలో చిత్రీకరణ జరుపుకోవడం కోసం ఏకంగా రూ.550 కోట్లు ఖర్చు అయ్యిందని దర్శకుడు రాజమౌళి వెల్లడించారు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరుపుతున్నట్లు సమాచారం. ఈ సినిమాకు ఏకంగా రూ.890 కోట్ల బిజినెస్ జరిగిందనే వార్తలు వస్తున్నాయి.

ఇలా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో నటించిన నటీనటులకు కూడా భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. హీరోలుగా నటించిన రామ్ చరణ్, ఎన్టీఆర్ లకి రూ.45 కోట్ల చొప్పున పారితోషకం అందించారట. అదేవిధంగా హీరోయిన్ అలియా భట్ రూ.9 కోట్లు తీసుకోగా, అజయ్ దేవగన్ రూ.25 కోట్లు తీసుకున్నట్లు సమాచారం.

ఇక దర్శకుడిగా రాజమౌళి ఈ సినిమా లాభాలలో 30 శాతం వాటా తీసుకోబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమా మరో పది రోజులలో ప్రేక్షకుల ముందుకు రానుండడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అలాగే ఈ నెల 18,19 తేదీలలో దుబాయ్, బెంగళూరు ప్రాంతాలలో ప్రీ రిలీజ్ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించడానికి మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now