మ‌ద్యం సేవిస్తూ కెమెరాకు చిక్కిన చార్మి.. నెటిజ‌న్ల విమ‌ర్శ‌లు..

March 10, 2022 8:19 PM

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా కూడా వివాదంగానే నిలుస్తుంది. సోషల్ మీడియా వేదికగా రామ్ గోపాల్ వర్మ చేసే పోస్టులు కూడా వైరల్ గా మారుతుంటాయి. బోల్డ్ ఇంటర్వ్యూల ద్వారా ఎంతో ఫేమస్ అయిన‌ వర్మ తనకు ఇష్టమైన వారి గురించి మాట్లాడుతూ వారి ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటారు. ఇలా ఇప్పటికీ తనకు నచ్చిన ఫోటోలు షేర్ చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన వర్మ తాజాగా నటి, నిర్మాత ఛార్మి ఫోటోని షేర్ చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

ram gopal varma shared charmy kaur drinking photo

చార్మి ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన వర్మ సర్కారీతో డ్రింక్ పార్టీ అంటూ కామెంట్ చేశారు. దీంతో ఈ ఫోటో క్షణాల్లో వైరల్ గా మారింది. ఈ క్రమంలో ఈ ఫోటోపై నెటిజన్లు తమ‌దైన శైలిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. వర్మ తాను ఎలాంటి తప్పు చేయలేదని చట్టానికి లోబడే ఉన్నానని, తనకు నచ్చిన విధంగానే ఉన్నానంటూ పలువురు తారల‌ ఫోటోలను షేర్ చేస్తుంటారు. అయితే ఈసారి ఏకంగా నిర్మాత చార్మి ఫోటోల‌ను షేర్ చేయడంతో అవి కాస్తా క్షణాలలో వైరల్ గా మారాయి.

చార్మి మ‌ద్యం సేవిస్తూ డ్రింక్ గ్లాస్ ను చేతిలో పట్టుకొని ఉన్న ఫోటోని వ‌ర్మ‌ షేర్ చేయడంతో ఈ ఫోటోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. వారు ర‌క‌ర‌కాల కామెంట్లు చేస్తున్నారు. చార్మి మ‌ద్యం కూడా తాగుతుందా.. అంటూ విమ‌ర్శిస్తున్నారు. ఇక ఈ ఫొటోపై చార్మి కూడా రియాక్ట్ అయ్యింది. స్మైలింగ్ ఎమోజీలను షేర్ చేసింది. ఇక వర్మ, చార్మి మధ్య మంచి అనుబంధం ఉన్న సంగతి మనకు తెలిసిందే. గతంలో వీరికి సంబంధించిన కొన్ని ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. దీంతో ఇప్పుడీ ఫొటో మ‌ళ్లీ వైర‌ల్ అవుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now