Manchu Lakshmi : మొదట్లో ఆ ఇబ్బందులు నేనూ పడ్డా.. మంచు లక్ష్మి సంచలన వ్యాఖ్యలు..

March 9, 2022 1:47 PM

Manchu Lakshmi : నటుడు మోహన్ బాబు కుమార్తె గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన లక్ష్మీప్రసన్న గురించి అందరికీ తెలిసిందే. ఈమె పలు సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉండే మంచులక్ష్మి సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటుంది.

Manchu Lakshmi sensation comments on her life
Manchu Lakshmi

ఇదిలా ఉండగా మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కావడంతో మంచు లక్ష్మీ జాతీయ మీడియాతో మాట్లాడుతూ మొదటిసారిగా క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా మంచు లక్ష్మి క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ తాను ఒక నటుడి కుమార్తెను అని తనకు ఎలాంటి ఇబ్బందులు ఇండస్ట్రీలో ఉండవని భావించానని, అయితే తాను కూడా కెరియర్ మొదట్లో క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదుర్కొన్నానని, బాడీ షేమింగ్ కి కూడా గురయ్యానని ఈ సందర్భంగా మంచు లక్ష్మి క్యాస్టింగ్ కౌచ్ పై మాట్లాడింది.

అయితే కాస్టింగ్ కౌచ్ అనేది కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా అన్ని చోట్లా ఉందని బ్యాంకింగ్, ఐటీ రంగాలలో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉందని ఈమె వెల్లడించింది. అయితే వీటన్నింటి గురించి పట్టించుకుంటే మనం ముందుకు సాగలేమని, అసలే తక్కువ జీవితంలో మనం సాధించాలనుకునే ఎన్నో కోరికలు ఉంటాయి. మనం ఎలా ఉన్నా బాడీ షేమింగ్ కి గురవుతాము. వీటి గురించి పట్టించుకుంటే మన లక్ష్యాన్ని చేరలేమని, వీటి గురించి ఆలోచించకుండా ముందుకు సాగాలని సూచించింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now