Niharika Konidela : ఇన్‌స్టాగ్రామ్‌కు నిహారిక గుడ్‌బై.. కారణం అదే..?

March 8, 2022 11:33 AM

Niharika Konidela : నిహారిక కొణిదెల పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మెగా డాటర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న నిహారిక యాంకర్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అనంతరం ఒక మనసు చిత్రంతో హీరోయిన్ గా మారిపోయింది. ఇలా మెగా కాంపౌండ్ నుంచి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మొదటి వ్యక్తిగా నిహారిక పేరు సంపాదించుకుంది. ఇండస్ట్రీలో యాంకర్ గా, హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే వ్యక్తిని వివాహం చేసుకుంది.

Niharika Konidela  deactivated her Instagram account
Niharika Konidela

వివాహం తర్వాత సినిమాలకు దూరమైన నిహారిక నిర్మాతగా ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అనే వెబ్ సిరీస్ నిర్మించి నిర్మాతగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇలా వైవాహిక జీవితంలో కూడా నిహారిక ఎంతో సంతోషంగా గడుపుతూ నిత్యం తనకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటోంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే నిహారిక ఉన్నఫలంగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ను డిలీట్ చేసింది.

అయితే నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ను డిలీట్ చేయడానికి కారణం ఏమిటి అని నెటిజన్లు పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తపరుస్తున్నారు.  గత కొద్ది రోజుల క్రితం నిహారిక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా జిమ్ కి సంబంధించిన వీడియోని షేర్ చేసింది. అయితే ఈ వీడియో పై పెద్ద ఎత్తున ట్రోల్స్ రావడంతో నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ను డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఈమె అకౌంట్ డిలీట్ చేయడానికి కారణం ఇదేనా.. లేకపోతే మరేదైనా కారణం ఉందా.. అనే విషయం తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment