Surekha Vani : సోష‌ల్ మీడియాలో సురేఖా వాణి ఫోన్ నంబ‌ర్ హ‌ల్ చ‌ల్‌.. అస‌లు క‌థ ఇదీ..!

March 5, 2022 4:10 PM

Surekha Vani : టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె పలు సినిమాలతో ఎంతో బిజీగా ఉండటమే కాకుండా తన కూతురుతో కలిసి సోషల్ మీడియాలో చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఇలా తన కూతురుతో కలిసి పలు డాన్స్ వీడియోలను చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సురేఖవాణికి సోషల్ మీడియా వేదికగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం మనకు తెలిసిందే.

Surekha Vani  phone number in social media real matter is this
Surekha Vani

ఇక సురేఖవాణి పేరు మీద గత కొద్ది రోజుల నుంచి ఒక ఫోన్ నంబరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ విషయంపై సురేఖవాణి స్పందిస్తూ సోషల్ మీడియాలో నా ఫోన్ నంబర్ అంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే అది నా నంబర్ కాదు. ఎవరూ కూడా అది నా నంబర్ అని కాంటాక్ట్ కావద్దు. అలాగే మీ పర్సనల్ డిటెయిల్స్ కూడా ఇవ్వకండి.. ఎలాంటి ట్రాన్సాక్షన్ చేయకండి.. అంటూ చెప్పుకొచ్చారు.

కొందరు కావాలనే తన పేరును వాడుకొని మోసాలకు పాల్పడుతున్నారని అందుకోసమే ఎవరూ తన ఫోన్ నంబర్ అంటూ వస్తున్న ఆ నంబర్ తో కాంటాక్ట్ కావద్దని సురేఖవాణి తన అభిమానులకు తెలియజేశారు. ఇక తనకు ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తప్ప ఎలాంటి ఫేస్ బుక్, ట్విటర్ ఖాతాలు కూడా లేవని ఇదివరకే చెప్పానని, మరోసారి కూడా చెబుతున్నానని, తనకు ఎలాంటి ఖాతాలు లేవని, ఎవరు కూడా అలాంటి అకౌంట్ నుంచి మెసేజ్ లు వచ్చినా రియాక్ట్ అవ్వకండి.. అంటూ ఈ సందర్భంగా ఈమె చెప్పుకొచ్చారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now