Silver Anklets : మ‌హిళ‌లు పాదాల‌కు బంగారు ప‌ట్టీల‌ను అస్స‌లు ధ‌రించ‌రాదు.. ఎందుకో తెలుసా ?

February 26, 2022 10:04 AM

Silver Anklets : మ‌హిళ‌లు కాళ్ల‌కు ప‌ట్టీల‌ను ధ‌రించ‌డం ఎప్ప‌టి నుంచో వస్తున్న ఆచారం. చాలా మంది వెండి పట్టీల‌ను ధరిస్తుంటారు. అయితే ఈ మ‌ధ్య కాలంలో పట్టీల్లోనూ అనేక వెరైటీలు ల‌భిస్తున్నాయి. కానీ కొంద‌రు వెండి ప‌ట్టీల‌కు బ‌దులుగా బంగారు ప‌ట్టీల‌ను ధ‌రిస్తున్నారు. అయితే శాస్త్రాలు చెబుతున్న ప్ర‌కారం మ‌హిళ‌లు కాళ్ల‌కు ఎల్ల‌ప్పుడూ వెండి ప‌ట్టీల‌నే ధరించాలి. బంగారు పట్టీల‌ను అస‌లు ధరించ‌కూడ‌దు. దీని వెనుక ఉన్న కార‌ణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

why women should wear Silver Anklets
Silver Anklets

పురాణాల ప్ర‌కారం బంగారం అంటే సాక్షాత్తూ ల‌క్ష్మీదేవితో స‌మానం. అందుక‌నే బంగారాన్ని మొక్కుతుంటారు. ఇక ల‌క్ష్మీదేవికి ప‌సుపు రంగు అంటే చాలా ఇష్టం. ఈ క్ర‌మంలో బంగారం కూడా ప‌సుపు రంగులో ఉంటుంది క‌నుక‌.. ఆ రంగులో వస్తువులు ఏవైనా స‌రే.. ఆఖ‌రికి ప‌ట్టీలు అయినా స‌రే.. పాదాల‌కు ధ‌రించ‌కూడ‌దు. బంగారం అంటే ల‌క్ష్మీదేవి క‌నుక.. అది ప‌సుపు రంగులో ఉంటుంది కనుక‌.. దాంతో త‌యారు చేసిన ప‌ట్టీల‌ను అస‌లు ధరించ‌కూడ‌దు.

ఇక ఆయుర్వేద ప్ర‌కారం.. వెండి మ‌న శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. వెండి వ‌స్తువులు ధ‌రిస్తే శ‌రీరంలో ఉన్న వేడి మొత్తం బ‌య‌ట‌కు పోతుంది. క‌నుక పాదాల‌కు ఎప్పుడూ వెండితో త‌యారు చేసిన ఆభ‌ర‌ణాల‌నే ధ‌రించాలి. అంటే వెండి ప‌ట్టీల‌నే ధ‌రించాలి. వెండి వ‌ల్ల దుష్ట‌శ‌క్తుల బాధ కూడా ఉండ‌దు. ఒంట్లో ఉండే నెగెటివ్ ఎన‌ర్జీ కూడా పోతుంది. క‌నుక మ‌హిళ‌లు పాదాల‌కు వెండి ప‌ట్టీల‌నే ధ‌రించాలి. బంగారు పట్టీల‌ను ధ‌రించ‌కూడ‌దు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment