Samantha : విడాకుల‌పై స‌మంత స్పంద‌న‌.. అప్పుడు అన్న‌ట్లే ఇప్పుడు జ‌రిగిందిగా..!

February 14, 2022 5:29 PM

Samantha : నాగ‌చైత‌న్య‌తో విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించిన త‌రువాత నుంచి స‌మంత‌పై పెద్ద ఎత్తున పుకార్లు వ‌చ్చాయి. అయితే త‌రువాత అవ‌న్నీ అబ‌ద్దాలేన‌ని తేలిపోయాయి. అలాగే ఈ జంట‌పై ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త వార్త‌లు బ‌య‌ట‌కు వ‌స్తూనే ఉన్నాయి. అస‌లు వీరిద్ద‌రూ ఎందుకు విడిపోయారు ? అనే విష‌యం ఇంత వ‌ర‌కు తెలియ‌లేదు, కానీ స‌మంత‌కు చెందిన పాత పోస్టుల‌ను మాత్రం తెగ వైర‌ల్ చేస్తున్నారు.

Samantha commented on divorce earlier now that became true
Samantha

గ‌తంలో ఓ నెటిజ‌న్ స‌మంత‌ను త‌న‌ను పెళ్లి చేసుకోవాల‌ని.. నాగ‌చైత‌న్య‌కు విడాకులు ఇవ్వాల‌ని అడిగాడు. అందుకు స‌మంత బ‌దులిస్తూ.. ఆ విష‌యం చైతూనే అడ‌గ‌మ‌ని చెప్పింది. అయితే అప్ప‌ట్లో ఆమె విడాకుల‌పై స‌ర‌దాగా చేసిన కామెంట్ ఇప్పుడు నిజ‌మైంద‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే స‌మంత పాత పోస్టును ఇప్పుడు మ‌ళ్లీ వైర‌ల్ చేస్తున్నారు.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే స‌మంత ప్ర‌స్తుతం కాతువాకుల రెండు కాద‌ల్ అనే త‌మిళ మూవీలో న‌టించింది. ఈ మూవీ ఏప్రిల్‌లో విడుద‌ల కానుంది. ఇక య‌శోద అనే పాన్ ఇండియా మూవీతోపాటు శాకుంత‌లం అనే సినిమాలోనూ స‌మంత న‌టించింది. త్వ‌ర‌లో ఓ వెబ్ సిరీస్‌తోపాటు ఓ బాలీవుడ్ మూవీలోనూ స‌మంత న‌టిస్తుంద‌ని తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now